హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యనగరంలో బిగ్ గ్రీన్ గణేశ్ : పేపర్లతో సుందరంగా తయారీ, భేష్ అని కొనియాడిన హీరో ఆది

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వినాయక చవితి వచ్చేస్తోంది. మరో పదిరోజుల్లో ఏకదంతుడు పూజలు అందుకోనున్నాడు. అయితే భారీ గణనాథుడి విగ్రహాల తయారీతో పర్యావరణానికి చేటు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పరిసరాలు మరింత పొల్యూట్ అవుతాయి. దీంతో ఏకో ఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించి .. పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇందులో భాగంగా సినీ హీరో ఆది సాయికుమార్ కూడా పిలుపునిచ్చారు. హీరోయిన్ నిత్య నరేశ్ కూడా ఏకో ఫ్రెండ్లీ వినాయకుడి ప్రతిమ పెట్టుకోవాలని సూచిస్తోంది.

ఏకో ఫ్రెండ్లీ గణేశ్ ..

ఏకో ఫ్రెండ్లీ గణేశ్ ..

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాల తయారీకి పర్యావరణ ప్రేమికులు నడుం బిగించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కలిసే అనర్థాలను వివరిస్తూ .. జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఇందులో సినీ హీరో ఆది, హీరోయిన్ నిత్యా నరేశ్ కూడా ఏకో ఫ్రెండ్లీ వినాయకులను వాడాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిగ్ గ్రీన్ గణేశ్ వాహనం గురించి వివరించారు. బిగ్ గ్రీన్ గణేశ్ వాహనం సిటీలో తిరుగుతూ పేపర్లే సేకరిస్తోంది. ఆ పేపర్లతో గణేశ్ ప్రతిమలను రూపొందిస్తోంది. అందంగా తయారుచేసిన వినాయకుడి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేస్తోంది.

బిగ్ గ్రీన్ గణేశ్ ..

బిగ్ గ్రీన్ గణేశ్ ..


హైదరాబాద్‌లో బిగ్ గ్రీన్ గణేశ్ వాహనం పలు ప్రాంతాలకు వెళ్లి పేపర్లు సేకరిస్తోంది. వాటి ద్వారా వినాయక విగ్రాహాలను తయారుచేస్తున్నారు. ఇది చాల మంచి పని అని ఆది కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం వారు తీసుకుంటున్న చర్యలను మనసారా అభినందించారు. వినాయక చవితి సందర్భంగా తాను ఇంట్లో వినాయక ప్రతిమ రూపొందిస్తామని హీరోయిన్ నిత్యానరేశ్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని కోరారు. మనం బాధ్యతగా మెలిగి భావితరాలకు మంచి ప్రకృతిని అందించాలని కోరారు.

సిటీలో పర్యటన

సిటీలో పర్యటన

ఈ నెల 30వ తేదీ వరకు బిగ్ గ్రీన్ గణేశ్ వాహనం నగరంలో పర్యటిస్తోందని నిర్వాహకులు తెలిపారు. పేపర్లు సేకరించి .. గణేశ్ ప్రతీమలు రూపొందిస్తామని తెలిపారు. ఏడు రోజులు మాల్స్‌లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. వినాయక చవితి పండుగ వచ్చేనెల 2 నుంచి పేపర్ గణేశ్ ప్రతిమను ప్రతిష్టించి పూజలు చేస్తామని చెప్పారు. తమ వాహనం వెళ్లే ప్రతి చోట అడిగిన వారికి వినాయకుడి ప్రతిమలను అందజేస్తామని తెలిపారు.

English summary
Vinayaka chavithi is coming. In the next ten days, Ekadanta will receive the pooja. But go for the environment with the making of huge statues. With Plaster of Paris the surroundings are more polished. Environmental lovers want to worship and create a friend. hero Adi Saikumar also called for this. The heroine Nitya Naresh also suggests to have a statue of Lord Ganesha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X