హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి .. 50 లక్షలపై ఆరా ...?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను వెంట తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి వారం కింద కాంగ్రెస్ వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారులను కూడా ఈడీ విచారించింది.

50 లక్షలు ఎక్కడివీ ?

50 లక్షలు ఎక్కడివీ ?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 2015 మే 30న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అప్పటి టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి గెలుపు కోసం అప్పుడు టీడీపీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ 50 లక్షలతో నగదుతో స్టీపెన్ ఇంటికి వచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, మత్తయ్య తదితరులను ఏసీబీ ప్రశ్నించి .. చార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో రేవంత్ అండ్ కో కోర్టును ఆశ్రయించగా .. కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ 50 లక్షల నగదు ఎక్కడిదనే అంశం గురించి ఈడీ ఆరాతీస్తోంది. ఇందులో భాగంగానే వారం క్రితం నరేందర్ రెడ్డిని ప్రశ్నించింది. ఇప్పుడు రేవంత ను కొశ్చన్ చేయనుంది. ఆ డబ్బు ఎక్కడిదీ .. ఎవరు ఇచ్చారు ... ఎవరి ఖాతా నుంచి డబ్బు బదిలీ అయ్యిందనే అంశంపై ఆరాతీయనుంది. విచారణలో రేవంత్ చెప్పే సమాధానాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోనుంది.

రూ.4.5 కోట్ల ఎక్కడినుంచి వస్తాయి ..

రూ.4.5 కోట్ల ఎక్కడినుంచి వస్తాయి ..

ఓటుకు నోటు కేసులో ఏ3 నిందితుడు ఉదయ్ సింహపై ఈడ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. స్టీపెన్ సన్ కు ఇచ్చేందుకు తీసుకొచ్చిన బ్యాగ్ ఎక్కడిదీ ? ఎవరిచ్చారు ? అందులో నగదు ఉన్నది మీకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. తర్వాత స్టీపెన్ కు ఇస్తానన్న రూ. 4.50 కోట్లు ఎక్కడినుంచి తీసుకొస్తారు ? ఆ డబ్బును మీకు ఎవరు ఇస్తానన్నారు అనే అంశంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించింది.

రేవంత్ తర్వాత ఉదయ్ కు పిలుపు ..

రేవంత్ తర్వాత ఉదయ్ కు పిలుపు ..

ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారిస్తోంది. ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు .. వేం నరేందర్ రెడ్డి, అతని కుమారులు ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయ్ ను ప్రశ్నించారు. ఇదే అంశంపై మంగళవారం రేవంత్ ను ప్రశ్నించి ... ఆయన చెప్పే సమాధానాలతో మళ్లీ ఉదయ్ ను పిలిచే అవకాశం ఉంది. ఆయన అసత్యాలు చెబితే .. తిరిగి ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. విడి విడిగా ప్రశ్నించడం పూర్తయ్యాక .. అందరినీ పిలిచి ఒకేసారి ఇంటరాగేషన్ చేస్తామని .. అప్పుడు వారు చెప్పిన సమాధానాల్లో తేడాను బట్టి నిజనిజాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు.

English summary
Congress party Working President Revant Reddy was present at the front of the Enforcement Directorate in the case. The documents related to the case were brought along. The EC also waited for Congress vem Narender Reddy and his sons under the week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X