హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంక్రాంతి తర్వాతే: తెలంగాణలో విద్యాసంస్థలు ఓపెన్.. కానీ నో అంటోన్న పేరంట్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా.. స్ట్రెయిన్.. ఇతర వైరస్ వల్ల మార్కెట్ స్తంభించిపోయింది. మిగతావి కొన్ని ఓపెన్ అయినా.. విద్యాసంస్థలు మాత్రం కంప్లీట్‌గా మూసివేశారు. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేరుగానే సరిగా అర్థం కానీ పరిస్థితి. దీంతో పాఠశాలలు ఓపెన్ చేయాలని భావిస్తోంది. కానీ వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో స్కూల్‌కి పంపించేందుకు పేరంట్స్ సుముఖత చూపడం లేదు.

విద్యాసంస్థలు తెరవాలనే అంశంపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులో ఉన్నతాధికారులు నివేదిక కూడా సమర్పిస్తారు. అందులో జనవరి 18వ తేదీ నుంచి స్కూల్స్ తెరవాలనే ప్రతిపాదన ఉంది. జూలై 31వ తేదీ వరకు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయాలని ఉంది. దీంతో పాటు పలు అంశాలను నివేదికలో పొందుపరిచారు. రోజు 3 గంటలపాటు తరగతులు నిర్వహించాలని సిఫారసు చేసింది.

education institutions open soon in telangana state

ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కోరింది. పదో తరగతి పరీక్షలు మాత్రం కాస్త లేట్‌గా అంటే.. మే మొదటివారంలో నిర్వహించాలని తెలిపింది. కరోనా వల్ల పరీక్షలు కాస్త ఆలస్యంగా నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే పేరంట్స్ మాత్రం పిల్లలను స్కూల్/ కాలేజీలకు పంపడంపై నో అంటున్నారు. చదువు కన్నా ప్రాణం ముఖ్యం అని చెబుతున్నారు.

ఇప్పటివరకు లాగానే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని కోరుతున్నారు. మార్చి నుంచి లాక్ డౌన్ అమలు చేశారని.. మరో రెండు నెలలు గడిస్తే అకడమిక్ ఇయర్ అయిపోతుందని చెబుతున్నారు. ఇప్పటికే 70 శాతం వరకు పోర్షన్ అయపోయిందని చెప్పారు. మరో 30 శాతం పోర్షన్ కోసం స్కూల్ తెరవడం సరికాదు అని అభిప్రాయపడుతున్నారు.

English summary
education institutions open soon in telangana state sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X