హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్లో కొంప ముంచిన ఓ బర్త్ డే పార్టీ ... ఒకే అపార్ట్ మెంట్ లో 23 మందికి కరోనా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది .కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం నెత్తి, నోరు కొట్టుకుని చెప్పినా సామాజిక దూరం పాటించకపోవటం ఒక అపార్ట్ మెంట్ వాసుల కొంప ముంచింది. ఏకంగా 23మంది కరోనా బాధితులుగా మారిన పరిస్థితి నెలకొంది..

 కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు చెప్పినా పాటించని అపార్ట్ మెంట్ వాసులు

కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు చెప్పినా పాటించని అపార్ట్ మెంట్ వాసులు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి మాస్కులు ధరించాలి, గుంపులుగా ఉండకూడదు . సామాజిక దూరం పాటించాలి . చేతులు శుభ్రంగా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి అని ఎంత చెప్పినా వినిపించుకోని ఒక అపార్ట్ మెంట్ వాసులు చేసిన పనికి ఇప్పుడు అందరూ బాధ పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే అని పట్టించుకోని వారు ఇప్పుడు కరోనా పేషెంట్లుగా మారి ఐసోలేషన్ లో బాధ పడుతున్నారు.

మాదన్నపేట్ లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే 23 మందికి కరోనా లక్షణాలు

మాదన్నపేట్ లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే 23 మందికి కరోనా లక్షణాలు

కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు అనటానికి ఈ ఘటనే నిదర్శనం. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ మాదన్నపేట్ లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే 23 మందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ అపార్ట్ మెంట్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బర్త్ డే సెలబ్రేషన్స్‌ జరిగాయి.

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న అపార్ట్ మెంట్ వాసులు

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న అపార్ట్ మెంట్ వాసులు


ఇక ఈ సెలబ్రేషన్స్ లో వీరంతా పాల్గొన్నారు. బర్త్ డే వేడుకలలో పాల్గొన్న వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉండటంతో కరోనా వైరస్ విస్తరించింది. ఇక ఈ అపార్ట్ మెంట్ లోని వాళ్ళు మాత్రమే కాకుండా బర్త్ డే వేడుకలకు హాజరైన మరో ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో మాదన్నపేటను కంటైన్మెంట్ క్లస్టర్‌గా మార్చారు. ఇక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు . దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Recommended Video

David Warner Recent Bahubali TikTok Video Goes Viral
హైదరాబాద్లో పెరుగుతున్న కరోనా .. 900కు చేరిన కేసులు

హైదరాబాద్లో పెరుగుతున్న కరోనా .. 900కు చేరిన కేసులు


తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే 1,454 కేసులు నమోదు కాగా 461కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక 959 మంది బాధితులు కరోనా బారి నుండి విముక్తి పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక 34 మంది మరణించారు .ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా హైదరాబాద్​లో కరోనా డేంజర్​ బెల్స్ ​మోగిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్ లోనే ఇప్పటివరకు 900 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి.

English summary
23 people living in an apartment in Santosh Nagar Madanapet, Hyderabad suffers with corona . Birthday celebrations for a software employee at the apartment during Corona Lockdown. All of them were affected by corona
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X