హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా భర్తను చంపినవాళ్లను ఎన్‌కౌంటర్ చేయండి: ఇలా అనుకోలేదంటూ హేమంత్ భార్య అవంతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన భర్తను కిరాతంగా హత్య చేసిన వారందరినీ ఎన్‌కౌంటర్ చేయాలని అతని భార్య అవంతి రెడ్డి డిమాండ్ చేశారు. తమను నమ్మించి మోసం చేశారని, ఇంత దారుణానికి తెగబడతారని అనుకోలేదని ఆమె వాపోయారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపుతారా?

ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపుతారా?

తనపై ప్రేమ ఉంటే తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తిని చంపుతారా? అని ఆమె మండిపడ్డారు. తన తల్లిదండ్రులకంటే అత్తామామ ఎక్కువగా ప్రేమించారని అవంతి అన్నారు. తమ ఇంటికి 10 మంది వచ్చి హేమంత్‌ను బలవంతంగా అమ్మానాన్న వద్దకు తీసుకెళ్తామని కిడ్నాప్ చేశారని తెలిపారు.

ఈ దారుణం ఊహించలేదు..

ఈ దారుణం ఊహించలేదు..

తన భర్త హత్యలో మేనమామలు విజేందర్ రెడ్డి, యుగేంధర్ రెడ్డి ఇన్వాల్స్ అవుతారని అనుకోలేదని వాపోయారు. తన భర్తను హత్య చేసిన వారందరినీ ఎన్‌కౌంటర్ చేయాలని అవంతి డిమాండ్ చేశారు. కూతురు ప్రేమ పెళ్లి నచ్చని అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన.. హేమంత్‌ను దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అవంతి మేనమామ గూడూరు యుగేంధర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకు హేమంత్ హత్య కేసులో 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

పగతో రగిలిపోయిన అవంతి తల్లిదండ్రులు

పగతో రగిలిపోయిన అవంతి తల్లిదండ్రులు


హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చందానగర్‌కు చెందిన హేమంత్, లక్ష్మారెడ్డి కుమార్తె అవంతి రెడ్డి జూన్ 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి.. జూన్ 11న వివాహం చేసుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన అవంతి తల్లిదండ్రులు నాలుగు నెలలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు. ఎలాగైనా హేమంత్‌ను హత్య చేసి తమ పగను చల్లార్చుకోవాలని నెల క్రితమే నిర్ణయించుకున్నారు.

మేనమామలతో పథకం వేసి దారుణం..

మేనమామలతో పథకం వేసి దారుణం..

నెల రోజుల క్రితమే లక్ష్మారెడ్డి.. తన భార్య అర్చన సోదరుడు యుగేంధర్ రెడ్డికి ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో తన అక్కా, బావ వేదనను చూసిన యుగేంధర్.. ఎలాగైన ఆ కొత్త జంటను విడదీయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యుగేంధర్ రెడ్డి, అతని సోదరుడు విజయేందర్ రెడ్డి అవంతి-హేమంత్ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డ 12 మంది బంధువులు, కిరాయి హంతకులు హేమంత్, అవంతిపై దాడి చేస్తూ బలవంతంగా కారులో ఎక్కించారు. గోపన్‌పల్లి వద్ద కారు నుంచి అవంతి, హేమంత్ తప్పించుకున్నారు. పారిపోతున్న వారిద్దరినీ పట్టుకున్నారు. అదే రోజు రాత్రి కారులోనే హేమంత్‌ను హతమార్చారు.

English summary
encounter the killers of my husband: Hemanth wife avanthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X