హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డాక్టర్‌గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్‌ యాప్‌తో బ్లాక్ మెయిల్

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌ : ఇంజినీర్ డాక్టర్‌గా మారాడు. రెండు చేతులా సంపాదించడానికి కాదు. మోసం చేయడానికి అలా అయ్యాడు. ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్ గా కొలువుచేస్తున్న సదరు ఇంజినీర్ బుద్ధి వక్రీకరించింది. దాంతో యువతులే టార్గెట్ గా మోసాలకు తెర లేపాడు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డేటింగ్ యాప్స్ తో అతడి మోసాల పర్వం ఈజీగా కొనసాగింది. చివరకు పాపం పండటంతో జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.

<strong>కలెక్టర్‌తో మాయావతి బూట్లు పాలిష్ చేపిస్తా..! మరోసారి నోరు జారిన అజం ఖాన్</strong>కలెక్టర్‌తో మాయావతి బూట్లు పాలిష్ చేపిస్తా..! మరోసారి నోరు జారిన అజం ఖాన్

ఇంజినీర్ అలియాస్ డాక్టర్

ఇంజినీర్ అలియాస్ డాక్టర్

కర్నూలు జిల్లా కేంద్రం లక్ష్మి నగర్‌కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా (35సం.) బతుకుబాటలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఉద్యోగం సక్రమంగా చేసుకోకుండా బుద్ధి వక్రీకరించింది. యువతులే టార్గెట్ గా.. ఓ డేటింగ్ యాప్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. చేసేది ఇంజినీర్ ఉద్యోగమైతే.. డాక్టరునంటూ ప్రొఫైల్ పెట్టుకున్నాడు.

ఈ నకిలీ డాక్టర్ ప్రొఫైల్ చూసి చాలామంది యువతులు బుట్టలో పడ్డారు. అయితే తనతో చాటింగ్ చేసిన యువతులను నెమ్మదిగా ముగ్గులోకి దించి వ్యక్తిగత ఫోటోలు సేకరించడం మొదలుపెట్టాడు. అలా చాలామంది నుంచి ప్రైవేట్ ఫోటోలు సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం వాటిని సాకుగా చూపి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వచ్చాడు. డబ్బులు ఇవ్వాలంటూ చాలామంది దగ్గర లక్షలకొద్దీ తీసుకున్నట్లు సమాచారం.

అలా పరిచయం.. ఇలా మోసం

అలా పరిచయం.. ఇలా మోసం

డేటింగ్ యాప్‌తో మోసాలు చేస్తున్న ఇంజినీర్ అలియాస్ డాక్టర్ కు.. హైదరాబాద్ కు చెందిన యువతి నాలుగేళ్ల కిందట పరిచయమైంది. అలా తరచుగా కలుసుకోవడంతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. అయితే తర్వాత కొద్దికాలానికి ఆమెకు పెళ్లి జరగడంతో చాటింగ్ ఆపేయాలని అతడిని కోరింది. అందుకు ససేమిరా అన్న అబ్దుల్లా.. బెదిరింపుల పర్వానికి దిగాడు.

 భరించలేక..! పోలీసులకు ఫిర్యాదు

భరించలేక..! పోలీసులకు ఫిర్యాదు

అబ్దుల్లాతో ఉన్న పరిచయం తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆ యువతి భయాన్ని ఆసరాగా తీసుకుని బరితెగించాడు. మొదట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఆమెతో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. అబ్దుల్లా టార్చర్ భరించలేక సదరు యువతి పలుమార్లు దాదాపు 4 లక్షల రూపాయల దాకా ముట్టజెప్పింది.

డబ్బులు తీసుకుని వదిలేస్తాడనుకున్న ఆ యువతికి నిరాశే మిగిలింది. వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో భరించలేక మార్చి 23వ తేదీన సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన గోడు వెళ్లబోసుకోవడంతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

English summary
Engineer turns as Doctor and cheated womens with dating app. He collected womens private photos while chatting and meeting. Then He blackmailed and collected huge money. One of the victim complaints to cyber crime police on his torcher, then police were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X