హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూర్య .. ఐదుగురు పోలీసుల విచారణ .. జయరాం హత్య కేసు స్పీడప్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జయరాం హత్యకు సహకరించిన సినీనటుడు సూర్య .. హత్య తర్వాత రాకేశ్ మాట్లాడిన ఐదుగురు పోలీసు అధికారులను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.

సూర్య పాత్రపై విచారణ ..

సూర్య పాత్రపై విచారణ ..

జయరాం హత్య కేసులో సినీ నటుడు సూర్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జయరాం హత్యలో సూర్య కీ రోల్ పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ అమ్మాయి ఉన్నదని జయరాంకు సూర్య ఫోన్ చేశాడు. దీంతో జయరాంకు ఏం చెప్పారు ? దసపల్లా హోటల్లో ఉన్న అమ్మాయి ఎవరు ? ఫోన్ చేస్తే రాకేశ్ ఆఫర్ చేసిన అంశాలేంటి అనే అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణ

బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణ

జయరాంను హత్య చేశాక రాకేశ్ రెడ్డి .. ఓ ఏసీపీ, సీఐ సహా మిగతా పోలీసులతో మాట్లాడారు. దీనికి సంబంధించి కాల్ డేటా సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు ... నేరం చేసిన వ్యక్తిని లొంగిపోవాలని చెప్పకుండా తప్పించుకోవాలని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందా అనే అంశంపై ఆరాతీయనున్నారు.

నందిగామలో సీన్ రీ కన్ స్ట్రక్షన్

నందిగామలో సీన్ రీ కన్ స్ట్రక్షన్

హత్య .. ఆ తర్వాత నందిగామకు జయరాం డెడ్ బాడీ తరలించడంతో మంగళవారం సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ఘటనాస్థలాన్ని నిశీతంగా పరిశీలించారు. రాకేశ్ రెడ్డితో కారులో ఇంకెవరు ఉన్నారు. ఆ సమయంలో రాకేశ్ ఇంకేవరితో మాట్లాడారనే కోణంలో ఎంక్వైరీ జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ ఆగాడనే అంశాలపై గుచ్చి గుచ్చి అడుగనున్నారు.. మరేవరి ప్రమేయం ఉన్నదనే కోణంలో కేసు విచారణ జరుగుతోంది.

 ఇప్పటికే 50 మంది విచారణ

ఇప్పటికే 50 మంది విచారణ

ఈ కేసులో ఇప్పటికే 50 మందిని పోలీసులు ప్రశ్నించారు. రాకేశ్ మాట్లాడిన ఐదుగురు పోలీసులు ... సూర్య విచారణతో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

English summary
Investigation is ongoing in the murder case of leading industrialist jayaram. Surya who co-starred Jayaram's murder. Five police officers who spoke to Rakesh after the murder were questioned at the Banjara Hills ACP office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X