హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణాలో టీడీపీ ప్రస్తుత పరిస్థితిని చెప్పి వైఎస్ షర్మిల పార్టీపై ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ లో వైయస్ షర్మిల కార్యాచరణను రూపొందించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్త పార్టీ వెనుక బిజెపి ఉందని టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఉందని బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో వైయస్ షర్మిల పార్టీ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

హస్తినలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై , వైఎస్ షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే హస్తినలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై , వైఎస్ షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే

ఆంధ్ర పార్టీలను తెలంగాణ ప్రజలు అంగీకరించరన్న ఎర్రబెల్లి

ఆంధ్ర పార్టీలను తెలంగాణ ప్రజలు అంగీకరించరన్న ఎర్రబెల్లి

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పార్టీ పెట్టినా ఆంధ్ర పార్టీలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని, స్వాగతించరని ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ,తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో టిడిపి ప్రస్తుత పరిస్థితి అందుకు నిదర్శనమని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా పార్టీలు వచ్చాయని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అలా వచ్చిన పార్టీలేవీ సక్సెస్ కాలేదని పేర్కొన్నారు.

షర్మిల పెట్టబోతున్న పార్టీ కూడా ఆంధ్ర పార్టీగానే ముద్ర పడే అవకాశం

షర్మిల పెట్టబోతున్న పార్టీ కూడా ఆంధ్ర పార్టీగానే ముద్ర పడే అవకాశం

ఎర్రబెల్లి వ్యాఖ్యలను బట్టి వైయస్ షర్మిల పెట్టబోతున్న పార్టీ కూడా ఆంధ్ర పార్టీగానే ముద్ర పడే అవకాశం ఉందని, ఆ పార్టీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం తక్కువేనన్న భావన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా కొత్త పార్టీ పెట్టి, వచ్చే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న వైయస్ షర్మిల కొత్త పార్టీపై ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.

తెలంగాణలో ఉండేది టీఆర్ఎస్ నే అంటున్న ఎర్రబెల్లి

తెలంగాణలో ఉండేది టీఆర్ఎస్ నే అంటున్న ఎర్రబెల్లి

వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సమావేశం లో పాల్గొంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తప్పా ఇతర ఆంధ్రా నుంచి వచ్చిన పార్టీలో స్థానం లేదని తేల్చి చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అటు బిజెపి పైన, కాంగ్రెస్ నేతల పైన నిప్పులు చెరుగుతున్నారు. బిజెపి చెప్పే పిచ్చి మాటలు నమ్మవద్దని, అదానీ లు, అంబానీలకు దేశాన్ని అమ్ముతున్నారని, అంతా ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా వస్తున్న పార్టీపై కూడా అది తెలంగాణలో నిలబడే పార్టీ కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.

English summary
Errabelli Dayakar Rao made sensational remarks that the people of Telangana do not accept and welcome the Andhra parties, regardless of the party of AP CM YS Jaganmohan Reddy's sister YS Sharmila. Errabelli Dayakar Rao opined that the current situation of TDP in Telangana after the separation of AP and Telangana into two states is a proof of that. Errabelli Dayakar Rao said that many parties have already come to Telangana and none of them has been successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X