హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈఎస్‌ఐ స్కామ్.. దేవికారాణి మళ్లీ అరెస్ట్ .. షెల్ కంపెనీలతో కోట్లు స్వాహా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయ్యి , ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిని మరోమారు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.దేవికారాణితో పాటు మరో తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు షెల్ కంపెనీలతో , డిస్ట్రిబ్యూటర్ ల అవతారమెత్తి అధిక ధరలకు మందులు కొనుగోలు చేశారని, అందులో దేవికారాణి పాత్ర ఉందని గుర్తించారు.

ఈఎస్ఐ స్కామ్ ..10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం చేసిన దేవికారాణి .. మరోసారి ఏసీబీ దాడులు ఈఎస్ఐ స్కామ్ ..10 కోట్ల బంగారు ఆభరణాలు మాయం చేసిన దేవికారాణి .. మరోసారి ఏసీబీ దాడులు

దేవికారాణితో పాటు మరో 9 మందిపై మరో కొత్త కేసు

దేవికారాణితో పాటు మరో 9 మందిపై మరో కొత్త కేసు

తాజాగా కొత్త కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దేవికారాణిని అరెస్ట్ చేశారు. 6.7 కోట్ల రూపాయల విలువైన మందులను అధిక ధరలకు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఈ రోజు ఆమెను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈఎస్ఐ స్కాంలో దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు ఈ కేసులో శ్రీ హరి బాబు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు గా గుర్తించారు. శ్రీహరిబాబు తనతో పాటు తన భార్య, అనుచరుల పేర్లమీద షెల్ కంపెనీలను సృష్టించి, డిస్ట్రిబ్యూటర్ల అవతారమెత్తి లెజెండ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఐఎంఎస్ నుండి నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు.

షెల్ కంపెనీలతో ఐఎంఎస్ నిధులు దారి మళ్ళించినట్టు గుర్తింపు

షెల్ కంపెనీలతో ఐఎంఎస్ నిధులు దారి మళ్ళించినట్టు గుర్తింపు

శ్రీహరి తన పలుకుబడితో ఐఎంఎస్ అధికారులను గ్రిప్ లోకి తెచ్చుకొని వ్యవహారం నడిపినట్లుగా గుర్తించారు. ఆపరేషన్ థియేటర్ లో ఉపయోగించే పరికరాల డిస్ట్రిబ్యూషన్ లో భారీ అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు హేమోక్యూ కంపెనీ నుండి తయారుచేసిన పరికరాలను డిస్ట్రిబ్యూటర్ 3300 రూపాయలకు కొనుగోలు చేసి, ఐఎంఎస్ నుండి ఒక్క యూనిట్ పై 16500 రూ చార్జ్ చేశారని అలా కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని గుర్తించారు .నకిలీ ఇండెన్స్, ఎక్కువగా కోడ్ చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు .

లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ వ్యవహారంలో దేవికారాణి తో పాటు మరో 9మంది అరెస్ట్

లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ వ్యవహారంలో దేవికారాణి తో పాటు మరో 9మంది అరెస్ట్

లెజెండ్ ఎంటర్ప్రైజెస్ ఐఎం ఎస్ కు 5547 యూనిట్లను సప్లై చేసినట్లుగా రెండు ఇండెంట్లు సృష్టించారని వాటిపై దేవికారాణి సంతకాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ తరహా చర్యలతో ప్రభుత్వ ఖజానాకు ఆరున్నర కోట్లకుపైగా గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.

దేవికారాణి తో పాటు కంచర్ల శ్రీ హరి బాబు అలియాస్ బాబ్జి, కంచర్ల సుజాత, వసంత, ఇందిర, పద్మ, కుక్కల కృపా సాగర్ రెడ్డి, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్, బండి వెంకటేశ్వర్లు లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Recommended Video

2580 Cr Deal For pinaka rocket launchers | Oneindia Telugu
తీగ లాగితే డొంకంతా కదులుతున్న వైనం

తీగ లాగితే డొంకంతా కదులుతున్న వైనం


మొదటి నుండి ఈఎస్ఐ స్కాం లో భారీ అవినీతికి పాల్పడిన దేవికారాణి వ్యవహారశైలిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు, ఇటీవల ఆమె ఒక కమర్షియల్ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన క్రమంలో నాలుగు కోట్లకు పైగా డబ్బును బిల్డర్ నుండి స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. తాజాగా షెల్ కంపెనీల వ్యవహారంలో దేవికారాణిని మరోమారు అరెస్ట్ చేశారు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈఎస్ఐ స్కామ్ లో అధికారుల అవినీతి, వాళ్లకు అనుబంధంగా పని చేసిన వారి రాకెట్ గుట్టు రట్టవుతుంది .

English summary
Former ESI director Devikarani, who was recently released on bail after being arrested in a sensational ESI scam in Telangana state, has been re-arrested by ACB officials. ACB officials investigating the ESI scam have found that Devikarani played a role in the sale of drugs at high prices to the fake distributors, along with shell companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X