హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్... మాజీ మంత్రి నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు...

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి శనివారం(ఏప్రిల్ 10) ఈడీ హైదరాబాద్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. దాదాపు 10కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో నాయిని దగ్గర పీఏగా పనిచేసిన ముకుంద రెడ్డి,ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికా రాణి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి.

సోదాల సందర్భంగా నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. సోదాల్లో పలు కీలక పత్రాలతో పాటు రూ.1కోటి నగదు,బ్లాంక్ చెక్కులు,ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

esi scam enforcement directorate raids in naini narsimha reddys son in law house

రెండేళ్ల క్రితం తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల విషయంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి నకిలీ బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో దేవికారాణితో పాటు తొమ్మిది మందిని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్ప‌టికే అవినీతి అధికారిణి దేవికారాణి నుంచి ఏసీబీ అధికారులు రూ.4.47 కోట్ల న‌గ‌దును గ‌తేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీల్లో,రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.అంతేకాదు,దేవికా రాణి ఎనిమిది డొల్ల కంపెనీలను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా గుర్తించారు.

Recommended Video

#Telangana severe Heatwaves : High Temperatures In Telangana మండుతున్న ఎండలు

ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి నాగలక్ష్మి దాదాపు రూ.50కోట్ల వరకూ అక్రమాస్తులు కూడబెట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దేవికా రాణి,ఈఎస్ఐ వ్యవస్థలోని పలువురు అధికారులు కలిసి అవసరం ఉన్నా లేకపోయినా మందులు,వైద్య పరికరాలు కొనుగోలు చేసి... అసలు కన్నా ఎక్కువ ధరలతో బిల్లులు సృష్టించి ఈ స్కామ్‌కి తెరలేపారు. తాజాగా ఈడీ నిర్వహించిన సోదాలకు సంబంధించి అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది.

English summary
The ED offcials on Saturday (April 10) conducted an extensive search in Hyderabad in connection with the ESI scam that has caused a stir in the state two years ago. Conducted simultaneous searches in more than 10 areas. As part of this, authorities also conducted searches at the house of Srinivas Reddy, the son-in-law of former minister Naini Narsimha Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X