హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అబ్బే అదేం లేదు.. ఈటల కాంగ్రెస్‌లో చేరికపై భట్టి.. ఊహాగానాలే

|
Google Oneindia TeluguNews

ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి భేటీ హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి కేటీఆర్ కామెంట్ చేయడంతో.. రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు భట్టి విక్రమార్క వంతు వచ్చింది. ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓ రిసార్ట్ లో రహస్యంగా కలిశారని.. ఏడాదిన్నర తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడంటూ జరుగుతున్న ప్రచారం ఊహాజనితం అని వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నారని భట్టి విమర్శించారు.రాష్ట్రంలో ఎన్నో ప్రజాసమస్యలు ఉండగా, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. హుజూరాబాద్ స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అసలు, టీఆర్ఎస్, బీజేపీ మధ్యే తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని భట్టి ఆరోపించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం మంతనాలు చేశారో చెప్పాలని నిలదీశారు. టీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేసేందుకు చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు.

 etela rajender to join congress is speculation bhatti vikramarka

హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.

English summary
bjp leader etela rajender to join congress party is speculation clp leader bhatti vikramarka said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X