హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు చోట్ల సమావేశాలు, తప్పే...? ఈటల రాజేందర్ పేరుతో లేఖ, వైరల్

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి ఈటల రాజేందర్ పేరుతో ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన సీఎం కేసీఆర్‌కు రాసినట్టు ఉంది. ఇందులో జరిగిన కొన్ని తప్పులను ఆయన ఒప్పుకున్నారు. పుణె, బెంగళూరులో సమావేశాలు నిర్వహించానని.. అదీ పార్టీ లైన్‌కు విరుద్దం అని.. క్షమించాలని ఈటల రాజేందర్ కోరారు. కానీ ఈ లేఖ నిజమైందో లేదో తెలియదు.. ఒకవేళ నిజమైతే.. ఈటల రాజేందర్ తప్పు చేశాడని.. అందుకే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారనే అంశంపై క్లారిటీ వస్తోంది.

20 ఏళ్ల నుంచి ఉన్నా..

20 ఏళ్ల నుంచి ఉన్నా..

పార్టీ ఆవిర్భావం నుంచి మీతో ఉన్నా.. అన్న అంటూ ఈటల రాజేందర్ లేఖ ప్రారంభం అవుతుంది. తనకు స్థాయికి మించి పదవులు అప్పగించారని అంగీకరించారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత చేశారని.. తమ్ముడిలా చూసుకున్నారని పేర్కొన్నారు. రెండుసార్లు మంత్రి పదవీ ఇచ్చి.. పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారని ఈటల రాజేందర్ గుర్తుచేసుకున్నారు.

తప్పుడు కథనాలు..

తప్పుడు కథనాలు..

ఇటీవల టీవీ చానెళ్లలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అయితే దాంతోపాటు అతను చేసిన తప్పులను కూడా అంగీకరించారు. బెంగళూరు, పుణెలో సమావేశాలు పెట్టానని చెప్పారు. అదీ తనంతట తాను చేయలేదని.. కొందరి ప్రోద్బలంతో చేశానని చెప్పారు. ఇదీ తప్పు అని.. క్షమించాలని కోరారు. మరోసారి తప్పు చేయనని.. పెద్ద మనసుతో మన్నించాలని కోరారు. భవిష్యత్‌లో తప్పు చేయనని ఈటల రాజేందర్ అన్నారు.

 పెద్దపల్లికి చెందిన నేతలు

పెద్దపల్లికి చెందిన నేతలు

ఈటల రాజేందర్‌తో పెద్దపల్లికి చెందిన నేతలు కొందరు పాల్గొన్నారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఈటలకు అనుచరుడిగా పుట్టమధుకు పేరు ఉంది. ఆయన పుణె, బెంగళూరు వెళ్లి ఉండొచ్చు.. తనతోపాటు ఆ నేతలను కూడా క్షమించాలని కోరారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అందులో రాసి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం వినిపించుకోలేదు. జరిగిన పరిణామాలు తెలుసుకొని.. తగిన చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. తర్వాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవీ, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 లేఖ నిజమేనా..?

లేఖ నిజమేనా..?

లేఖ నిజమో తెలియదు.. కానీ జరిగిన పరిణామాలు చూస్తే నిజంగా జరిగినట్టే ఉంది. దీనిపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన పేరుతో వచ్చింది. దాంతోపాటు సమావేశాలు నిర్వహించానని కూడా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఈ లేఖపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.

English summary
etela rajender write letter to cm kcr told to pune, bangalore tours. to sorry to cm kcr. letter is viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X