వరద సాయం చేయకుండా కిరికిరి పెట్టిండ్రు నాకొడుకులు: కేసీఆర్ ఆన్ ఫైర్
హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని తమ బిడ్డలుగానే చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనే చర్చ ప్రజల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అని చెప్పారు. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలని కోరారు. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలని మరీ మరీ కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
జూటా కోర్, తుపాకీ రాముడు.. కేసీఆర్, కేటీఆర్‌పై జేజమ్మ అరుణ నిప్పులు

చర్చ జరగాలే..
అలాంటి ఆలోచన వచ్చినప్పుడే మంచి నేతలు రాజకీయాల్లో ఉంటారని చెప్పారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయని తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్ చైతన్యవంతమైనది..చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్ అని కేంద్రప్రభుత్వం స్పష్టంచేసింది.

నిరంతరాయంగా విద్యుత్..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్ అని కేసీఆర్ చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరించానని తెలిపారు. ఎంతో కృషి, పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

సంక్షేమ ఫలం
కల్యాణ లక్ష్మీ పథకంతో పేదలకు ఆసరాగా నిలుస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అందజేసే సాయంతో పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. కులం, మతం, వర్గం, ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్ కిట్లు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు అందజస్తున్నామని చెప్పారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే బీమా అందజేస్తున్నామని.. వారం రోజుల్లో రూ.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు. దీంతో కుల, మత, ప్రాంతాలకతీతంగా సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.