హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఖిలప్రియకు ప్రాణహనీ ఉంది, జైలులో ఉగ్రవాదిగా చూస్తున్నారు: భూమా మౌనిక

|
Google Oneindia TeluguNews

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె సోదరికి ప్రాణహాని ఉంది అని భౌమా మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఇక్కడే కాదు ఎక్కడ కూడా రక్షణ లేదని చెప్పారు. ఏపీలో వైసీపీ సర్కార్ ఉండగా.. అఖిల ప్రియ టీడీపీ క్రియాశీల నేతగా కొనసాగుతున్నారు. దీంతో ఏపీలో రక్షణ లేదని.. అలాగే తెలంగాణలో కూడా వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు భూమా మౌనిక మీడియాతో మాట్లాడారు.

అఖిలప్రియకు ప్రాణహానీ ఉంది..

అఖిలప్రియకు ప్రాణహానీ ఉంది..


అఖిలప్రియకు ప్రాణహాని ఉందని భూమా మౌనిక వాపోయారు. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా అని మౌనిక ప్రశ్నించారు. రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారని అడిగారు. అఖిలప్రియ సరిగా భోజనం కూడా చేయడం లేదని వివరించారు. ఇటీవల ఆమెకు ఆరోగ్యం బాగా లేదని మౌనిక తెలిపారు. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నా వేధిస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతేకాదు జైలులో అఖిలప్రియను ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు.

సరైన వైద్యం అందించడం లేదు

సరైన వైద్యం అందించడం లేదు

జైలులో అఖిలప్రియకు సరైన వైద్యం కూడా అందించడం లేదని ఆరోపించారు. భూ వివాదంపై చర్చించడానికి తాము సిద్ధమని భూమా మౌనిక స్పష్టం చేశారు. ల్యాండ్ ఇష్యూ.. నాన్న బతికి ఉన్నప్పటి నుంచి ఉందన్నారు. అమ్మానాన్న ఆళ్లగడ్డకో.. కర్నూలుకో పరిమితమైన నేతలు కాదని వివరించారు. శోభా నాగిరెడ్డి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. పోలీసులే కేసును నిర్ధారిస్తే కోర్టులు ఎందుకు అని అడిగారు. ఏ ఆధారాలతో అఖిలప్రియను అరెస్ట్‌ చేశారని భూమా మౌనిక ప్రశ్నించారు.

 బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మరోవైపు మాజీ మంత్రి అఖిలప్రియ కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు కేసు నమోదుచేసే ఉద్దేశం ఏ మాత్రం లేదని పోలీసులు చెబుతున్నారు. సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని, ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు చెప్పారు.

English summary
ex minister bhuma akhila priya life threaten in prison her sister bhuma mounika alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X