హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా అఖిలప్రియ నోరు, ముక్కు నుంచి రక్తం.. మెమోలో లాయర్

|
Google Oneindia TeluguNews

మాజీమంత్రి అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో ఆమె తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ జైల్లో కింద పడిపోయారని న్యాయవాది పేర్కొన్నారు. ఆమెకు ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. చికిత్స కోసం ఈఎన్‌టీ సర్జన్ వద్దకు తరలించాలని కోరారు. అఖిలప్రియ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసేలా.. జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు.

Recommended Video

#Akhilapriya ఉస్మానియా ఆస్పత్రిలో భూమా అఖిలప్రియకు వైద్య పరీక్షలు

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో చంచల్‌గూడ మహిళా జైలుకు రిమాండ్‌కు తరలించిన అఖిల ప్రియను ఆరోగ్య కారణాల రీత్యా జైలు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బుధవారం ఆమెకు పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌లోని బస్తీ దవాఖానలో కరోనా టెస్టు నిర్వహించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె నీరసం వచ్చి పడిపోయారు.

ex minister bhuma akhila priya nose, mouth came from blood

బుధవారం పొద్దున నుంచి ఏమీ తినకపోవడంతో ఇలా జరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఆమెను మేజిస్ట్రేట్‌ ఇంటికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు జైల్లో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. జైల్లో అఖిలప్రియకు యూటీ నంబరు (అండర్‌ ట్రయల్‌) 1509 కేటాయించారు. ఈ కేసులో అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా ఉన్నారు. ఏ2గా అఖిలప్రియ ఉండగా.. అనూహ్యంగా అఖిలప్రియను ఏ1గా మార్చారు. ఆమెపై పోలీసులు మరో రెండు సెక్షన్లు ఐపీసీ 147, 385 నమోదు చేశారు.

English summary
ex minister bhuma akhila priya nose, mouth came from blood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X