హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం షాపులను వెంటనే మూసివేయండి, ఒక్కరోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో తెరచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యోతక్క ఒక్కరోజు దీక్ష చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో దీక్ష చేశారు. మద్యం షాపులను వెంటనే మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 మద్యం మత్తులో గొడవ, మూడో అంతస్తు నుంచి తోసిన ఇద్దరు, మేస్త్రీ మృతి మద్యం మత్తులో గొడవ, మూడో అంతస్తు నుంచి తోసిన ఇద్దరు, మేస్త్రీ మృతి

మద్యం షాపుల తెరవడంపై సీఎం కేసీఆర్ మరోసారి ఆలోచించాలని ఆమె కోరారు. లిక్కర్ షాపులకు బార్లా తెరవడంతో.. వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ఆందోళన నెలకొందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల పేదలు, మధ్యతరగతి వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని.. వైన్ షాపులకే మందుకే డబ్బులు ఇస్తే.. కుటుంబాల సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. లిక్కర్ షాపులను వెంటనే మూసివేయాలని.. లేదంటే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని కొమిరెడ్డి జ్యోతక్క హెచ్చరించారు.

ex mla komireddy jyothakka hunger strike

బుధవారం నుంచి తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే వైన్ షాపుల వద్ద ప్రజలు గుమిగూడి ఉండటంతో ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తి చెందుతుందోననే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే కొందరు వైన్ షాపులు మూసివేయాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క ఒకరోజు దీక్ష చేపట్టారు.

English summary
metpally ex mla komireddy jyothakka one day hunger strike for close wineshops in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X