• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ వైపు విఠల్ చూపు.. నేతల సంప్రదింపులు, హస్తిన వేదికగా చేరిక..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. బెర్త్ దక్కనివారు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీలను వీడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ థ్రెట్ ఎక్కువగా ఉంది. ప్రత్యామ్నాయ పార్టీల వైపు ఆ నేతలు చూస్తున్నారు. అయితే ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి సీఎం కేసీఆర్ తగిన గుర్తింపును ఇచ్చారు. నామినెటేడ్ పోస్టులను ఇచ్చారు. వారిలో విఠల్ ఒకరు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ పీఎస్సీ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయనకు మరో నామినెట్ పదవీ వరించలేదు. దీంతో స్తబ్దుగా ఉన్న ఆయన.. బీజేపీ వైపు చూస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఆయనతో కమలదళ నేతలు చర్చలు జరిపారని సమాచారం. అన్నీ సర్దుకుంటే.. ఈ నెల 9వ తేదీన విఠల్ బీజేపీలో చేరే అవకాశం ఉంది.

అసంతృప్తికి కారణమిదే..

అసంతృప్తికి కారణమిదే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. ఇటే ట్యాగ్ లైన్ అందరూ చెబుతారు. అయితే దీనిపై విఠల్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. రాష్ట్ట్రంలో ఇప్పుడు బీజేపీ బలియమైన శక్తిగా ఎదుగుతుంది. అందుకే ఆ పార్టీ నేతలు విఠల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవానికి టీఎస్ పీఎస్సీ సభ్యుడిగా పదవీకాలం ముగిసిన వెంటనే.. దానికే చైర్మన్ లేదంటే.. మరో పదవీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన బాధతో ఉన్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది.

డిజైన్ మార్పు

డిజైన్ మార్పు


రాష్ట్రంలో ఉద్యోగ నియయకాలు సరిగా జరగడం లేదు. దీనిపై విఠల్ అసంతృప్తితో ఉన్నారు. ఇదే అంశంపై ధిక్కార స్వరం కూడా వినిపిస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ మార్చడాన్ని కూడా తప్పుపట్టారు. తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ కాకుండా జోగులాంబ జోన్‌లో చేర్చడాన్ని కూడా వ్యతిరేకించారు.

ఇవ్వని అపాయింట్‌మెంట్

ఇవ్వని అపాయింట్‌మెంట్

ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి సీఎంతో కలిసి చర్చించాలని విఠల్ అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అనుమతి ఇవ్వలేదు. పై పరిణామాలను బీజేపీ పరిశీలిస్తోంి. తమ పార్టీలోకి రావాలని కోరుతుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్, జేపీ నడ్డా.. ఇతర నేతలు, సంఘ్ పరివార్ కూడా అతనితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం విఠల్ ఉపయోగపడతాయని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. త్వరలో ఢిల్లీ వేదికగా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

తెలంగాణ కోసం

తెలంగాణ కోసం

తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, జేఏసీ సెక్రటరీ జనరల్‌గా, కో చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఉద్యోగ నేతగా చాటి చెప్పారు. 1996 నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు ఆయన పోరాటం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కోదండరాం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పనిచేశారు. ఆయన కెరీర్ జర్నలిస్టుగా మొదలైంది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. గ్రూప్-2 కొట్టి అడిటర్‌గా పనిచేశారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఎస్ పీఎస్సీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు.

పార్టీలో కూడా చురుగ్గా..

పార్టీలో కూడా చురుగ్గా..

అప్పట్లో దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి పార్టీ నడపగా.. కోదండరాం, విఠల్ మంచి సహకారం అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సభ కూడా నిర్వహించారు. ప్రజలను తొలుత ఆ పార్టీ ఆకట్టుకున్న.. తర్వాత అంతగా ప్రాచుర్యం లభించలేదు. దీంతో పార్టీ మరుగన పడింది. కానీ విఠల్ మాత్రం స్వ రాష్ట్రం కోసం పోరాడారు.

English summary
ex tspsc member vittal will join bjp in the soon. bjp leaders are talked to vittal. he is angry with cm kcr attitude
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X