హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బ‌య‌ట‌ బాగోతం..! పార్కింగ్ పేరుతో నొక్కేస్తున్న కేటుగాళ్లు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : సికింద‌రాబాద్ రైల్యే స్థేష‌న్ అత్యంత ర‌ద్దీతో ఉండే ప్ర‌దేశం. నిత్యం ల‌క్ష‌ల సంఖ్య‌లో వాహ‌నాలు వ‌చ్చి త‌మ వారిని పికప్ చేసుకోవ‌డ‌మో డ్రాప్ చేసి వెళ్ల‌డ‌మో జ‌రుగుతుంటుంది. స‌మ‌యానికి రావాల్సిన రైలుబండి కాస్త ఆల‌స్యం అయ్యిందంటే అస‌లు క‌ధ అక్క‌డే మొద‌లౌతుంది. తాము వ‌చ్చిన వాహ‌నాన్ని ఓ అర‌గంటో, గంటో ప‌క్క‌న పార్క్ చేచాల‌నుకునే వాల్ల‌కు మాత్రం పార్కింగ్ కాంట్రాక్ట‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. పార్కింగ్ లో గంట లోపు ఒక రేటు, గంట దాటితే మ‌రో రేటు పేరుతో వాహ‌న దారుల జేబుల‌కు చెక్ పెడుతున్నారు పార్కింగ్ దందా రాయుళ్లు. తాజాగా గంట గ‌డ‌వ‌క ముందే వాహ‌నం పార్క్ చేసి గంట దాటిందంటూ ద‌బాయించి డ‌బ్బులు వ‌సూలు చేసిన వైనం వెలుగులోకి వ‌చ్చించి.

Excited from the Secunderabad Railway Station..!! The contractors collecting huge amount on the name of parking..!!

సికింద‌రాబాద్ రైల్వే స్టేష‌న్ లో పార్కింగ్ దందా య‌ధేచ్చ‌గా సాగుతొంది. ఇదేంటి అని అడిగిన వారికి కాంట్రాక్ట‌ర్లు ఘాటుగానే స‌మాధానం చెడుతున్నారు. ఒక్కోసారి ఎదురు దాడి చేసేందుకు కూడా వెన‌కాడ‌డం లేదు. గంటకు 18 వసూల్ చేస్తున్న కాంట్రాక్టర్లు గంట గ‌డ‌వ‌క‌ముందే స‌మ‌యం ముగిసింద‌ని డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నారు. టోకెన్ జారీ సమయాన్ని 15 నిమిషాలు తక్కువగా చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుల తీరు వాహ‌న దారుల‌కు ఇబ్బందిగా మారింది. ఏంటి ఈ అన్యాయం అని అడిగిన వారికి మాత్రం అవ‌మానం త‌ప్ప‌డం లేదు.

Excited from the Secunderabad Railway Station..!! The contractors collecting huge amount on the name of parking..!!

కోట్లు పెట్టి టెండర్ వేశామని, మా ఇష్టమని సమాధానం చెబుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిర్వాహకులు. ఒక్క రోజు పార్కింగ్ చేస్తే 425 వసూలు చేస్తున్నారు నిర్వాహ‌కులు. బలుపెక్కిన వారు కోట్లు పెట్టి టెండర్ లు కైవసం చేసుకొని ఆదాయాన్ని గ‌డిస్తున్నార‌ని, పార్కింగ్ ఫీస్ పేరుతో సామాన్య ప్రజలకు మాత్రం పెను భారం ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌నిఖీ అదికారులు ఇప్ప‌టికైనా ఇలాంటి అక్ర‌మ దందా వ్యాపాల‌రుల ప‌ట్ల చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

English summary
Parking fees business going a head at railway station in Secunderabad.And the rate at the hour is checked at the rate of another hour. The people feeling parking fees are being overweight. Inspections are still demanding people to take action against such illegal migrant workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X