• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బయోడైవర్సిటీ ఫైఓవర్ నరహంతక బ్రిడ్జ్.. కూల్చేసి కట్టాలని సీపీఐ నారాయణ ఫైర్

|

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుండి కారు కింద పడిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఇప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణం పై దుమారం రేగింది. ప్రమాదకర నిర్మాణంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ ఘటనలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నిపుణుల కమిటీ వేసింది. ఇక ఇదే సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీపీఐ మద్దతు లేకున్నా హుజూర్ నగర్ బరిలో గెలుస్తారట: గులాబీ పార్టీ లెక్క ఇదేనట !!

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నారాయణ సంచలనం

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నారాయణ సంచలనం

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను కూల్చివేయాలని ఎక్కువ మలుపులు లేకుండా తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నరహంతక వంతెన గా మారిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను పునర్నిర్మించకుంటే భవిష్యత్తులో ఇది మరిన్ని ఘోర ప్రమాదాలకు కారణంగా మారుతుందని ఆయన అన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తో కలిసి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను సందర్శించారు.

మై హోం రామేశ్వరరావుకు ప్రయోజనం చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆరోపణ

మై హోం రామేశ్వరరావుకు ప్రయోజనం చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆరోపణ

అక్కడ కారు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు సీపీఐ నారాయణ. డిజైన్ మార్చినట్టు ఉన్న గూగుల్ మ్యాప్ తో ఆయన ఫ్లై ఓవర్ పై ప్రదర్శన నిర్వహించి ఫ్లైఓవర్ నిర్మాణం పై ఆయన వ్యాఖ్యలు చేశారు. మై హోమ్ రామేశ్వరరావు ప్రయోజనం చేకూర్చడానికి బ్రిడ్జ్ నిర్మాణంలో అలైన్మెంట్ మార్చి మలుపులు తిప్పారని నారాయణ ఆరోపించారు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన కమిటీ వాహన వేగంపై కాకుండా, బ్రిడ్జి డిజైన్ పై ప్రధానంగాఅధ్యయనం చెయ్యాలని కోరారు.

 బ్రిడ్జ్ ను కూల్చివేసి మళ్ళీ పునర్నిర్మించాలని నారాయణ డిమాండ్

బ్రిడ్జ్ ను కూల్చివేసి మళ్ళీ పునర్నిర్మించాలని నారాయణ డిమాండ్

బ్రిడ్జ్ ను కూల్చివేసి మళ్ళీ పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ బ్రిడ్జ్ డిజైన్ పై అధ్యయనం చేసి నిష్పాక్షికంగా నివేదిక ఇవ్వాలని లేదంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ వేగం వల్లే ప్రమాదం జరిగిందని, వంతెన డిజైన్ మార్పు అంశం బయటకు రానీయకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ నేతలు మండిపడ్డారు.

 అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ

అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ

వంతెనను ఎక్కువ మలుపులు తిప్పడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు లేకుండా తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఆ పని చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఇక బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మితిమీరిన వేగంతో వెళ్లి కింద పడిన కారు ఘటనలో నిపుణుల కమిటీ తమ పరిశీలన ప్రారంభించింది. 105 కిలోమీటర్ల వేగంతో ఇన్నోవా తో నిపుణుడైన డ్రైవర్తో ఫ్లైఓవర్ పై సీన్ ను రీ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించింది.

వంతెనపై ఇన్నోవా కారుతో సీన్ రీ కన్స్ట్రక్షన్

వంతెనపై ఇన్నోవా కారుతో సీన్ రీ కన్స్ట్రక్షన్

వంతెన పైకి దూసుకెళ్లిన ఇన్నోవా కార్ తో మలుపు వద్ద మొదటి లైన్ నుండి చివరి లైన్ లోకి ప్రవేశించారు. ప్రహరీని ఢీకొట్టే సమయంలో వేగాన్ని 0 చేసి పరిస్థితిని అంచనా వేశారు. వేగాన్ని నియంత్రించకపోతే, వాహనాన్ని ఆపకపోతే ఏం జరిగి ఉండేది అన్నదానిపై అంచనా వేశారు నిపుణుల కమిటీ. ఇక ప్రమాద ఘటనపై ఫ్లైఓవర్ నిర్మాణ నమూనా కచ్చితత్వం పై ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రమాదాల గురించి, బ్రిడ్జి పై ఉన్న మలుపులు గురించి సమగ్ర పరిశోధన చేస్తోంది.

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై నిజానిజాల నిగ్గు తేల్చనున్న నిపుణుల కమిటీ

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై నిజానిజాల నిగ్గు తేల్చనున్న నిపుణుల కమిటీ

ఇక బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నిర్మాణానికి లీ అసోసియేట్స్ ఇచ్చిన వంతెన రేఖాచిత్రం, వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత తీసుకున్న కొలతలు ఆధారంగా రూపొందించిన డిజైన్ వివరాలను జిహెచ్ఎంసి అధికారులు నిపుణుల కమిటీకి అందించారు. ఇక వీటన్నిటినీ పరిశీలించాక అసలు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ప్రమాదాలకు కారణం ఏంటి ? బ్రిడ్జి డిజైన్ లోపమా ? లేక వాహనదారుల అజాగ్రత్తనా ? మితిమీరిన వేగమా అనేది నిపుణుల కమిటీ తేల్చనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana State Biodiversity Flyover has been hit by a car crash from the top of the flyover.The government has set up an expert committee to prevent these incidents from arising. Meanwhile, CPI leader Narayana made a sensational comment on the biodiversity flyover. He said that to demolish the construction and re construct the bridge with out so many turnings. at the same time expert committee tried to re construct the car accident scene .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more