• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ.!పీసీసీ కోసం విపరీతమైన పోటీ.!ఉక్కిరిబిక్కిరవుతున్న మనిక్కం.!

|

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క కీలక నేతలు పార్టీ మారుతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న టీ కాంగ్రెస్, సంస్థాగతంగా బలోపేతంతో పాటు కీలక పదవుల భర్తీపైన దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదివి కోసం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మనిక్కం ఠాగూర్ శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. అందరికి ఆమోదమైన అభ్యర్థితో పాటు పార్టీని పట్టలెక్కించి పరుగులు పెట్టించే నేతకోసం గాంధీ భవన్ లో వేట ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

  TPCC Post Competition: Telangana Congress లో ఉత్కంఠ.. రేవంత్ రెడ్డికే టీపీసిసి అవకాశం..!!
  కొత్త పీసిసి నేత కోసం వేట.. సంప్రదింపుల్లో మునిగిపోయిన మనిక్కం ఠాగూర్..

  కొత్త పీసిసి నేత కోసం వేట.. సంప్రదింపుల్లో మునిగిపోయిన మనిక్కం ఠాగూర్..

  కాంగ్రెస్ పార్టీ అంటేనే వివాదాలు, గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ఆదిపత్యానికి పెట్టింది పేరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాతావరణం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటుంది. అయినప్పటికి సమయం సందర్బం కలిసివచ్చినప్పుడు నాయకులందరూ ఏకమై పార్టీని విజయ తీరాలకు చేర్చిన సందర్బాలు కూడా లేకపోలేదు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేతల మద్య తీవ్ర ఆదిపత్య పోరు నెలకొంటుంది. అది పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తుందని తెలిసినా కూడా నాయకులు పెద్దగా పట్టించుకోని పలరిస్థితులు నెలకొంటాయి. ఇలాంటి పరిస్థితులను అదిగమించేందుకు పటిష్టమైన పీసిసి నేతకోసం ఎఐసిసి వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

  తీవ్రమైన పోటీ.. పీసిసి తమకంటే తమకంటున్న నేతలు..

  తీవ్రమైన పోటీ.. పీసిసి తమకంటే తమకంటున్న నేతలు..

  తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పీసిసి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించిన మరుక్షణం నుండి కొంతమంది నేతలు పీసిసి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో నేతలు పీసిసి పదవిని ఆశిస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరోపక్క పీసిసి అభ్యర్ది ఎంపిక కోసం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కం ఠాగూర్ గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతూ అభిప్రాయసేకకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న కోర్ కమిటీ, నేడు ఎఐసీసీ కార్యదర్శులు, రేపు రాష్ట్ర ముఖ్యనేతలను సంప్రదించబోతున్నారు మనిక్కం ఠాగూర్.

  పార్టీని నిలబెట్టాలి.. కీలక నేత ఎంపిక కోసం శ్రమిస్తున్న ఠాగూర్..

  పార్టీని నిలబెట్టాలి.. కీలక నేత ఎంపిక కోసం శ్రమిస్తున్న ఠాగూర్..

  ఇదిలా ఉండగా అభిప్రాయ సేకరణలో భాగంగా ఏఐసిసి ఇంఛార్జ్ ఉక్కిబిక్కిరయ్యే పరిణామాలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. పీసిసి అభ్యర్దిగా ఎవరైతే పార్టీ పట్టాలెక్కుతుందన్న ప్రశ్నకు ఎక్కువ శాతం నేతలు తమ పేరునే పరిగణలోకి తీసుకోవాలని, తానైతేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తానని చెప్పడం ఠాగూర్ ను ఆశ్ఛర్యానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. పదుల సఖ్యలో అభ్యర్దులు తమ పేరును పరిశీలించాల్సిందిగా ఠాగూర్ కు ప్రత్యక్షంగా రికమండ్ చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

  రేవంత్ రెడ్డికే అవకాశం.. ఇద్దరు ముగ్గురు మినహా అంతా ఓకే..

  రేవంత్ రెడ్డికే అవకాశం.. ఇద్దరు ముగ్గురు మినహా అంతా ఓకే..

  కాగా ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా, దయనీయంగా తయారయినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంక్షను నెరవేర్చినప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ముఖ్య నేతలందరూ పార్టీ పరిటిష్టతకోసం కష్ట పడకుండా అదును చూసి పార్టీ మారిన సందర్బాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా సాధారణ ఎన్నికలతో పాటు, ఉప ఎన్నికలు, బల్దియా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇలాంటి తరుణంలో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే నేతకోసం అదిష్టానం ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ప్రధానంగా కోమటి రెడ్డి వెంకటి రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలలో ఒకరికి పీసిసి పదవి వరించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం మనిక్కం ఠాగూర్ మూడు రోజులుగా పార్టీనేతల అభిప్రాయలు సేకరిస్తున్నారు.

  English summary
  It seems that Manikkam Tagore, in-charge of AICC affairs, is working for the post of Telangana Congress party president. It seems that the hunt is on in Gandhi Bhavan for a leader who can count on the party along with a candidate who is acceptable to all.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X