హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఇక కొత్త ఫీచర్.. త్వరలో న్యూస్ అప్‌డేట్స్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. అందులోభాగంగా త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

<strong>కిరాక్ డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. రోబోలా మెలికలు తిరుగుతూ..! (వీడియో)</strong>కిరాక్ డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. రోబోలా మెలికలు తిరుగుతూ..! (వీడియో)

కొన్ని వార్తా సంస్థలతో కలిసి న్యూస్ ఫీచర్‌ను తెరంగేట్రం చేయనుందనే టాక్ నడుస్తోంది. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లలో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదలావుంటే న్యూస్ ఫీచర్‌ను మొదట అమెరికాలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యూజర్లను న్యూస్ ఫీచర్‌తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ఫేస్‌బుక్. ఆ క్రమంలో ఎప్పటకప్పుడు వార్తలను అప్‌డేట్ చేసేందుకు అక్కడి ప్రముఖ వార్తా సంస్థలతో టైఅప్ అవుతున్నట్లు సమాచారం. సంవత్సరం ప్యాకేజీగా మాట్లాడుకుని న్యూస్ ఫీచర్‌ను అద్భుతంగా అందించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Facebook would like to be relevant in news again

ఆ లెక్కన ఆయా వార్తా సంస్థలకు దాదాపు 3 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు సిద్ధమైందట ఫేస్‌బుక్ సంస్థ. అంతేకాదు దానికి అవసరమైన లైసెన్సులు కూడా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ న్యూస్ ఫీచర్‌ కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూస్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందట. మొత్తానికి న్యూస్ మార్కెట్‌పై కన్నేసిన ఫేస్‌బుక్ మరింత లాభాలు ఆర్జించే దిశగా దూసుకెళ్లనుందనే విషయం స్పష్టమవుతోందిగా.

English summary
Facebook is approaching big name news publishers hoping to secure licensing deals to republish stories and other news content, reports The Wall Street Journal. The deals could be worth millions of dollars per publisher, with Facebook reportedly offering up to $3 million a year for licensing rights for some outlets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X