హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛాటింగ్ చేస్తాడు.. కొంపలు ముంచుతాడు.. హైదరాబాద్ మహిళను వేధించి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పెరిగిన టెక్నాలజీ కొంపలు ముంచుతోంది. అరచేతిలో ప్రపంచం ఏమో గానీ ఇల్లు గుల్ల చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకునేంత లోపు అనర్థాలు జరిగిపోతున్నాయి. లియని పరిచయాలను గుడ్డిగా నమ్ముతూ లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ క్రమంలో ఫేస్‌బుక్ సాక్షిగా నిండా మునిగిపోయిన హైదరాబాద్ మహిళ ఉదంతం ఇప్పుడు హాట్ టాపికైంది. గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఆమెను లక్షల రూపాయలకు ముంచేసింది.

మహిళలతో ఫ్రెండ్‌షిప్.. ఆ తర్వాత మోసం

మహిళలతో ఫ్రెండ్‌షిప్.. ఆ తర్వాత మోసం

సోషల్ మీడియా వేదికగా యువతులతో ఫ్రెండ్‌షిప్ పెంచుకుంటాడు. తనకు తాను పెద్ద బిజినెస్ మ్యాన్‌గా పరిచయం చేసుకుంటాడు. అలా ముగ్గులోకి దించాక విశ్వరూపం చూపిస్తాడు. అక్కడి నుంచి తనలోని పైశాచికత్వాన్ని బయటపెట్టి డబ్బులు గుంజుతాడు. స్నేహం ముసుగులో యువతులను నమ్మించి నట్టేట ముంచుతున్న ఆ ఘరానా మోసగాడు ఎట్టకేలకు సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది యువతులను మోసం చేసినట్లు గుర్తించారు. వీడియో కాలింగ్‌తో ప్రైవేటు ఛాటింగ్‌ చేసి యువతుల నగ్న చిత్రాలు సేకరిస్తాడు. అనంతరం వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడని సైబర్‌ క్రైంపోలీసుల విచారణలో తేలింది.

<strong>అందమైన అమ్మాయిలు.. కోరుకున్న ప్యాకేజీలు.. లవ్ ఆర్ట్ డేటింగ్ అంటూ..!</strong>అందమైన అమ్మాయిలు.. కోరుకున్న ప్యాకేజీలు.. లవ్ ఆర్ట్ డేటింగ్ అంటూ..!

ముంబై బడా వ్యాపారిగా ఫోజులు.. హైదరాబాద్ మహిళకు టోకరా

ముంబై బడా వ్యాపారిగా ఫోజులు.. హైదరాబాద్ మహిళకు టోకరా

చెన్నైకి చెందిన మహ్మద్ సల్మాన్ నవాజ్ సర్కార్ కొంతకాలంగా ముంబైలో స్థిరపడ్డాడు. ఆ క్రమంలో తనకు తాను పెద్ద వ్యాపారిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటాడు. అంతేకాదు ప్రైవేట్ బాడీగార్డులను వెంటేసుకుని తిరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చి దిగిన ఫోటోలను ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటాడు. అలా మిడిల్ ఏజ్ మహిళలను టార్గెట్ చేస్తూ వారిని ఆకర్షించేలా ఫోటోలు పంపుతుంటాడు. అతగాడి హంగు ఆర్భాటం చూసి మహిళలు ఇట్టే అట్రాక్ట్ అయ్యేవారు. అదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన మహిళను కూడా మోసం చేశాడు.

 వీడియో కాల్స్, ప్రైవేట్ ఛాటింగ్.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్

వీడియో కాల్స్, ప్రైవేట్ ఛాటింగ్.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్

ముంబై బడా వ్యాపారిగా ప్రొఫైల్ కనబడటంతో పాటు అతడి ఫోటోలు కూడా అదే రేంజ్‌లో ఉండటంతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ సల్మాన్‌కు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌గా మారారు. ఆ క్రమంలో అతడితో తరచుగా ఛాటింగ్ చేయడంతో పాటు వీడియో కాల్స్ కూడా మాట్లాడేవారు. ఈ సమయంలో సల్మాన్‌ నవాజ్‌ ముంబైలో బడా వ్యాపారీనంటూ నమ్మించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నట్లు నమ్మించి వీడియో కాలింగ్‌తో పాటు, ప్రైవేటు చాటింగ్‌ చేశాడు. అదే క్రమంలో అత్యవసరంగా డబ్బులు కావాలని తీసుకున్నాడు. తీరా ఆమె తన వలలో పడిందని గ్రహిచాక బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె తనతో చేసిన ఛాటింగ్‌తో పాటు తనకు పంపిన ఫోటోలను నెట్టింట్లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అలా దాదాపు 12 లక్షల 96 వేల రూపాయలు గుంజాడు.

<strong>కేటీఆర్‌ను తిట్టిన అధికారి.. 10 కోట్ల నిధులు ఇస్తే.. కోటి మాయం చేస్తానంటూ పిచ్చి కూతలు..!</strong>కేటీఆర్‌ను తిట్టిన అధికారి.. 10 కోట్ల నిధులు ఇస్తే.. కోటి మాయం చేస్తానంటూ పిచ్చి కూతలు..!

నిండా మునిగారు.. 12.96 లక్షలు పోగొట్టుకున్నారు..!

నిండా మునిగారు.. 12.96 లక్షలు పోగొట్టుకున్నారు..!

జనవరి నెలలో అతడితో పరిచయం ఏర్పడి ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆమె అంత పెద్ద మొత్తం పోగొట్టుకున్నారు. అయితే అతగాడి వేధింపులు ఇంకా ఎక్కువయ్యే సరికి ఆమె తట్టుకోలేక పోయారు. చివరకు ఈ నెల 11వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సల్మాన్ నవాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అయితే అతడు ఇదివరకు చాలామందిని ఇలానే ట్రాప్ చేసి మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు వెలుగుచూసే అవకాశముంది.

English summary
Cyberabad Police arrested a person who posed himself as a self-styled big businessman of Mumbai. According to the report of the police, Salman Nawaz (32), resident of chennai used to pose himself as big businessman belongs to mumbai. He used to blackmail girls under the pretext of making friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X