హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగాలంటూ మోసం.. నకిలీ నోటిఫికేషన్లు.. తస్మాత్ జాగ్రత్త..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఉద్యోగాల పేరిట నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బుట్టలో వేసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగాల పేరు చెప్పి కుచ్చుటోపి పెడుతున్నారు. ఇటీవల ఇలాంటి తరహా మోసాలు ఎక్కువ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోసగాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. అదలావుంటే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు కావడం చర్చానీయాంశమైంది.

రూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటనరూ.618 కోట్లు.. రెండునెలల కరెంట్ బిల్లు... మోడీ ఇలాకాలో ఘటన

 మిషన్ భగీరథలో ఉద్యోగాలు.. సోషల్ మీడియాలో నకిలీ నోటిఫికేషన్

మిషన్ భగీరథలో ఉద్యోగాలు.. సోషల్ మీడియాలో నకిలీ నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఉద్యోగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. అచ్చు ప్రభుత్వ ప్రకటన లాగే ఉండటంతో చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. వందనో, వెయ్యో కాదు ఏకంగా 13 వేల 530 పోస్టులు ఉన్నాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో చాలామంది నిరుద్యోగులు అట్రాక్ట్ అయ్యారు.

జిల్లాల వారీగా ఖాళీలు పేర్కొనడంతో పాటు కేవలం పదో తరగతి పాసయితే చాలు అనేసరికి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. అయితే దరఖాస్తు చేయాలంటే 110 రూపాయలు ఫీజుగా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే అర్హులంటూ ఆ ప్రకటనలో సూచించారు.

తస్మాత్ జాగ్రత్త..!

తస్మాత్ జాగ్రత్త..!


మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఉద్యోగాలు.. అవి కూడా చాలా ఎక్కువగా ఉండేసరికి నిరుద్యోగులు చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అయితే అది ఫేక్ నోటిఫికేషన్ అని నిర్ధారించారు ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు నోటిఫికేషన్‌ను నమ్మొద్దని సూచించారు. నిరుద్యోగులను మోసం చేయడానికి కొందరు నకిలీ నోటిఫికేషన్ జారీ చేశారని.. అది నమ్మి ఎవరూ కూడా డబ్బులు కట్టొద్దన్నారు. ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఐదుగురు అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఐదుగురు అరెస్ట్

అదలావుంటే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల పేరిట ఓ ముఠా మోసాలకు పాల్పడుతోంది. అమాయకులే టార్గెట్‌గా నిలువు దోపిడీ చేస్తున్న ఐదుగురు సభ్యులున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తుక్కుగూడ ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు.

రూట్ మార్చుతూ.. నిరుద్యోగులను ఏమార్చుతూ..!

రూట్ మార్చుతూ.. నిరుద్యోగులను ఏమార్చుతూ..!


ఇదివరకు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చేసేవారు. అయితే కొందరు నేరగాళ్లు రూట్ మార్చి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో చాలామంది డబ్బులు పొగొట్టుకుంటున్న సందర్భాలు కొకొల్లలు. తాజాగా మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఉద్యోగాల పేరిట వచ్చిన నకిలీ నోటిఫికేషన్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేరగాళ్లు ఎంతగా బరి తెగిస్తున్నారో ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Cheaters targeting unemployment youth in the name of job notifications. Recently, Mission Bhagiratha Fake Job Notification circulated in Social Media. The Officials said that and confirmed as its fake notification and advised to unemployment youth as dont trust such notifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X