హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999

|
Google Oneindia TeluguNews

ఖైరతాబాద్‌ : కారుకు తగ్గ నెంబరుండాలే. లక్షలు పెట్టి కొన్న కారుకు నార్మల్ నెంబర్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే మరికొన్ని లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్లకు ఎగబడుతున్నారు. ఈ మోజు హైదరాబాద్ లో మరీ ఎక్కువ. తగ్గేదే లేదు.. మెట్టు దిగేదే లేదు. అనుకున్న నెంబర్ కావాలంటే టెండర్ ఎమౌంట్ ఎంతదాకైనా వేయాల్సిందే . ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్.. ఆర్టీఏకు కాసుల పంట కురిపిస్తోంది. అదలావుంటే సోమవారం (15.04.2019) ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలం పాట ఇద్దరి మధ్య ఫైటింగ్ కు కారణమైంది.

<strong>ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రం</strong>ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రం

9999.. 10 లక్షలు

9999.. 10 లక్షలు

సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా రవాణాశాఖకు.. 30 లక్షల 55 వేల 748 రూపాయల ఆదాయం సమకూరింది. అందులో 9999 (ఆల్ నైన్స్) నెంబర్ వాటా 10 లక్షల రూపాయలు కావడం విశేషం. TS09 FE 9999 నెంబరును NSL ప్రాపర్టీస్ అనే కంపెనీ 10 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.

TS09 FE సిరీస్ ముగియడంతో కొత్తగా TS09 FF సిరీస్ ప్రారంభమైంది. ఇందులో నెంబర్ 1 ను FRR హిల్ హోటల్స్ గ్రూప్ 6 లక్షల 95 వేల రూపాయలకు దక్కించుకుంది. అదలావుంటే నెంబర్ 9 సంఖ్యకు వీపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం అధిక ధర రాకపోవడం గమనార్హం. ఆర్టీఏ అధికారులు నిర్ణయించిన నామినల్ ప్రైస్ 50 వేల రూపాయలకే అమ్ముడుపోయింది. ఇక 99 నెంబరును 2 లక్షల 78 వేల రూపాయలు వెచ్చించి ఎమర్జిన్ అగ్రినోవా అనే సంస్థ సొంతం చేసుకుంది.

0001 కోసం డిష్యుం డిష్యుం

0001 కోసం డిష్యుం డిష్యుం

ఫ్యాన్సీ నెంబర్ల టెండర్ ప్రక్రియ ఘర్షణకు దారి తీసింది. కొత్తగా TS09 FF సిరీస్ ప్రారంభం కావడంతో.. ఫుల్ డిమాండున్న 0001 నెంబర్ కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగి దాడికి దారి తీసింది. వాస్తవానికి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకున్నప్పుడు ఆర్టీఏ అధికారులు నిర్ణయించిన ధరను మించి తమకు ఆమోదయోగ్యమైన ధరను టెండర్ చేస్తారు. ఆ క్రమంలో 0001 నెంబర్ కోసం నలుగురు వ్యక్తులు టెండర్ వేశారు.

అయితే సమయం ముగిసి బాక్సులోని కవర్లు తీస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆల్ ఆఫ్ సడెన్ గా వచ్చి తన టెండర్ వేయబోయారు. అయితే అప్పటికే టెండర్ వేసి అక్కడే నిల్చున్న వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయారు. దాంతో నన్నే ఆపుతావా అంటూ ఆయన దాడి చేశారు. మొత్తానికి చివర్లో వచ్చి టెండర్ వేసిన వ్యక్తి దరఖాస్తును అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు.

ఆల్ నైన్స్.. భలే క్రేజ్

ఆల్ నైన్స్.. భలే క్రేజ్

ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ తో ఆర్టీఏకు భారీగా ఆదాయం వస్తోంది. అయితే బాగా డిమాండున్న 9999 (ఆల్ నైన్స్) కు 10 లక్షల రూపాయల ధర తొలిసారిగా 2018, జూన్ రెండో వారంలో జరిగిన టెండర్లలో వచ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ కోటి రూపాయల ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారు కోసం ఈ నెంబరును దక్కించుకున్నారు. అప్పుడు 10 లక్షల 46 వేల 722 రూపాయలకు టెండర్ వేసి సొంతం చేసుకున్నారు. అయితే అంతవరకు 9999 నెంబర్.. 9 లక్షల రూపాయల వరకు మాత్రమే
ధర పలికింది.

English summary
Super-rich Hyderabadis are increasingly splurging on fancy car number plates, and the craze is turning out to be quite a boon for the Road Transport Authority. Khairatabad RTA office Auction caused to fighting between two people for 0001 number and 10 lakh rupees gain for 9999.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X