హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫెడరల్ ఫ్రంట్ యాత్ర .. కేసీఆర్ వెళ్ళిన చోటల్లా చంద్రబాబు గురించి ఏం చెప్తున్నారో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ వెళ్ళిన చోటల్లా.. బాబు గురించి ఏం చెప్తున్నారో తెలుసా..?? || Oneindia Telugu

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకు వెళ్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆవశ్యకతను చెప్పడంతో పాటుగా, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాల్సిన ఆవశ్యకతను ప్రాంతీయ పార్టీల నేతలతో చెబుతున్నారు. అంతటితో ఊరుకోక బీజేపీయేతర పార్టీల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తూ మోడీ మీద పోరు చేస్తున్న చంద్రబాబు నాయుడుపై ఎక్కడ లేని అక్కసునంతా వెళ్లగక్కు తున్నాడు.

కేసీఆర్ కన్నా జగన్ బెటర్ .. ఏ విషయంలో అంటారా ? కేసీఆర్ కన్నా జగన్ బెటర్ .. ఏ విషయంలో అంటారా ?

వెళ్ళిన ప్రతిచోటా చంద్రబాబు ఓటమిపాలవుతాడని చెప్తున్న కేసీఆర్

వెళ్ళిన ప్రతిచోటా చంద్రబాబు ఓటమిపాలవుతాడని చెప్తున్న కేసీఆర్

వెళ్లిన ప్రతిచోట ఏపీలో చంద్రబాబు నాయుడు ఓటమి పాలు అవుతారని, జగన్ విజయం సాధిస్తారని చెప్పుకొస్తున్నారు కేసీఆర్. మొన్నటికి మొన్న చెన్నైలో స్టాలిన్ ని కలవడానికి వెళ్లిన కేసీఆర్ స్టాలిన్ తో ఏపీలో మీరు అనుకుంటున్నట్లుగా చంద్రబాబు గెలవడం లేదని, జగన్ మాత్రమే అక్కడ గెలుస్తాడని, వైసీపీ 20 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే స్టాలిన్ కెసిఆర్ చెప్పిన విషయాన్ని తోసిపుచ్చారు. ఇక ఇదే విషయాన్ని ఏపీకి వచ్చిన డీఎంకే నేత దొరై మురుగన్ చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్


ఒక స్టాలిన్ దగ్గర మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కెసిఆర్ చంద్రబాబు ఓడిపోతాడని చెప్పి ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రాంతీయ పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు కెసిఆర్ వేసిన ఎత్తుగడలు ఏవీ వర్కౌట్ కాలేదు. మొదటి నుంచి చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ చంద్రబాబు ఓటమి పాలైతే తన ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు. అందుకోసం జగన్ కు బాసటగా నిలిచారని జోరుగా ప్రచారం సైతం జరిగింది. ఇక బీజేపీయేతర కూటమిని దెబ్బ కొట్టడానికి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతల దగ్గరకు వెళుతున్న కేసీఆర్ తనదైన శైలిలో వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ టార్గెట్ చంద్రబాబు .. చంద్రబాబుపై నమ్మకం తగ్గించేందుకే ఫెడరల్ ఫ్రంట్ యాత్ర

ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ టార్గెట్ చంద్రబాబు .. చంద్రబాబుపై నమ్మకం తగ్గించేందుకే ఫెడరల్ ఫ్రంట్ యాత్ర

ఈ క్రమంలో చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కెసిఆర్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు విషయంలో ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ మాటలను నమ్మడం లేదు.

అంతేకాదు ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ అక్కడ కెసిఆర్ చంద్రబాబు గురించి ఏం చెప్తున్నారు అన్న విషయం చంద్రబాబు కు చేరుతుంది. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు ఓటమి పాలవుతారని, చంద్రబాబుకి ఇమేజ్ లేదని, పూర్తిగా ఏపీ ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్నారని కెసిఆర్ ప్రచారం చేస్తున్నారు. తద్వారా చంద్రబాబుపై నమ్మకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఫెడరల్ ఫ్రంట్ వైపు సదరు ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
The Telangana CM KCR, who is attempting through the Federal Front to bring about a qualitative change in the country's politics, is again moving towards the Federal Front. Wherever he goes he is saying that AP CM Chandrababu naidu is going to loose this time , and Jagan is going to win the elections . KCR , who went to meet Stalin in Chennai earlier, told him that Chandrababu will not win in the AP, saying that the Jagan will win there and that the YCP will win 20 Lok Sabha seats . Stalin dismissed the KCR's claim. The DMK leader Dorai Murugan told Chandrababu, which was the issue of the same. Wherever KCR goes, Chandrababu is targeted by KCR .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X