హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరానికి పండుగ శోభ..! ఆదివారం లష్కర్ బోనాల కోసం ఏర్పాట్లు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బోనాలజాతర మహోత్సవాలకు సికింద్రాబాద్‌లో అంకురార్పణ|Bonalu Festival Begins From Ujjain MahankaliTemple

హైదరాబాద్ : చారిత్రాత్మక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలకు ఆదివారం(21 జూలై 2019) అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం ప్రప్రథమ ఘట్టం ఘటోత్సవంతో బోనాల మహోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉత్సవాలకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. మూడో ఆదివారం అమ్మవారి బోనాల మహోత్సవాలు జరుగుతాయి.

బోనాలు పూర్తయ్యే వరకూ అమ్మవారు ఘటం రూపంలో సికింద్రాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తారు. బోనాల శోభ లష్కర్‌‌కు రెండు రోజుల ముందే వచ్చింది. ఉజ్జయిని మహంకాళి అమ్మకు ముదిరాజ్‌ లు ఆనవాయితీ ప్రకారం శుక్రవారం అంగరంగ వైభవంగా ముందస్తు బోనాలు సమర్పించారు. ఇదిలా ఉండగా ఆదివారం వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో అమ్మవారి ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది.

వైభవంగా ఉజ్జయినీ అమ్మవారి బోనాలు..! ఏర్పట్లలో మునిగిపోయిన యంత్రంగం..!!

అత్యంత ప్రాధాన్యం కలిగిన ఘటం తయారీ బాధ్యతను మారేడుపల్లికి చెందిన రత్నయ్య వంశస్థులే సుమారు ఐదు తరాలుగా నిర్వహిస్తున్నారు. ఘటాన్ని రూపొందించడానికి ఉపయోగించే అమ్మవారి ముఖ ప్రతిమ, ఇతర వస్తులకు తొలుత మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సికింద్రాబాద్‌ కర్భలా మైదానంలోని డొక్కలమ్మ ఆలయానికి తరలిస్తారు. వేలాది మంది భక్తజనం ఊరేగింపుతో కర్భలామైదానం, డిస్టిల్లరీరోడ్డు, విక్టోరియాగంజ్‌, పాన్‌బజార్‌, రంగ్రేజీబజార్‌ ప్రాంతాల మీదుగా మహంకాళి అమ్మవారు ఆలయానికి చేరుకుంటుంది. దారిపొడవునా మహిళలు హారతులు పడతారు. 11 నుంచి అమ్మవారు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. పచ్చికుండపై ఓ కాలు పెట్టి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ పచ్చికుండను కూడా రత్నయ్య వంశస్థులే తరతరాలుగా అందిస్తున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..! ఆది, సోమవారాల్లో ఉత్తర మండలంలో అమలు..!!

ట్రాఫిక్‌ ఆంక్షలు..! ఆది, సోమవారాల్లో ఉత్తర మండలంలో అమలు..!!

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలనుకేటాయించారు. ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్‌ హిల్‌ స్ట్రీట్, జనరల్‌ బజార్, అదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్‌ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ మధ్య ఉన్న సుభాస్‌ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు.
కర్బలా మైదాన్‌ నుంచి రాణిగంజ్‌ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్‌ రోడ్, రసూల్‌పురా చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్‌ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్‌ మీదుగా పంపిస్తారు. బైబిల్‌ హౌస్‌ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్‌మండి చౌరస్తా, సజన్‌లాల్‌ స్ట్రీట్‌ మీదుగా పంపిస్తారు.

మద్యం విక్రయాలపై కూడా ఆక్షలు..! మండి పడుతున్న మందుబాబులు..!!

మద్యం విక్రయాలపై కూడా ఆక్షలు..! మండి పడుతున్న మందుబాబులు..!!

ఉజ్జయినీ బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట్, గాంధీనగర్‌ ఠాణాల పరిధిలో ఇది అమల్లో ఉంటుంది. స్టార్‌ హోటల్స్‌ బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. దీంతో మందుబాబులు కాస్త అబ్కారీ శాఖ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పార్కింగ్‌ ప్రాంతాలివే..! ఎవరి వామనం బాద్యత వారిదే..!!

పార్కింగ్‌ ప్రాంతాలివే..! ఎవరి వామనం బాద్యత వారిదే..!!

1)సెయింట్‌ జాన్స్‌ రోటరీ, ఉప్‌కార్, ఎస్బీహెచ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీ. 2) కర్బాలా మైదాన్, బైబిల్‌ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్‌. 3) రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్‌ హైస్కూల్‌. 4) సుభాష్‌ రోడ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం. 5) మంజు థియేటర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్‌

English summary
The celebration will be held on Sunday (21st July 2019) at the historic Secunderabad Ujjain Mahankali Bonalu. The Bonalu Festivities begin with the first event of the afternoon on sunday. Authorities have already completed the arrangements for the festivities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X