హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hyderabad: సంతకాలు ఫోర్జరీ కేసులో సినీ నటుడు అరెస్ట్..

సంతకాల ఫోర్జరీ కేసులో సినీ నటుడుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.

|
Google Oneindia TeluguNews

ఓ సినీ నటుడు సంతకాలు ఫోర్జరీ చేస్తూ సంస్థ ఆస్తులను సొంతం చేసుకుంటున్నాడని ఫిర్యాదు రావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ నటుడు అట్లూరి నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి సంస్థ ఆస్తులను సొంతం చేసుకున్నాడని బాధితుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

అట్లూరి నవీన్​రెడ్డి, ఎమ్.శ్రీధర్​రెడ్డి, పి.నవీన్ కుమార్ డైరెక్టర్లుగా గతేడాది ఎన్ స్వ్కేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్​ లిమిటెడ్ సంస్థను మొదలు పెట్టారు.సూర్యాపేట జిల్లాకు చెందిన అట్లూరి నవీన్​ రెడ్డి సినిమాల్లో నటించాలని హైదరాబాద్ కు వచ్చాడు. ఓ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతనికి సరిగా అవకాశాలు రాకపోవడంతో ఖాలీగా ఉన్నాడు.

Film actor Atluri Naveen Reddy has been arrested by the police in a case of forgery of signatures.

ఈ క్రమంలోనే ఎమ్.శ్రీధర్​ రెడ్డి, పి.నవీన్ కుమార్ స్థిరాస్థి సంస్థను ఏర్పాటు చేశారు. అయితే అట్లూరీ నవీన్ రెడ్డి పలు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన స్థలాలను ఫోర్జరీ సంతకాలతో విక్రయించి, సొమ్ము చేసుకున్నట్టు మిగిలిన భాగస్వాముల దృష్టికి వచ్చింది. దీంతో వారు రూ.55 కోట్ల మేర నష్టపోయినట్లు వారు గుర్తించారు. నవీన్ రెడ్డి ఆ సొమ్ముతో కొత్త సినిమా ప్రారంభించినట్లు తెలుసుకున్నారు.

జనవరి 2న సీసీఎస్ పోలీసులకు శ్రీధర్​ రెడ్డి, నవీన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అప్పటి నుంచి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్న నవీన్ రెడ్డి తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు.

English summary
A film actor was arrested by the police after receiving a complaint that he was forging signatures and taking possession of the assets of the company. The victims complained that film actor Atluri Naveen Reddy cheated and took possession of the company's assets with forged signatures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X