film industry minister ktr Coronavirus donations music india chinese virus తెలుగు సినీ పరిశ్రమ మంత్రి కేటీఆర్ విరాళాలు చైనా వైరస్ ఇండియా
కరోనా: వెల్లువెత్తుతున్న విరాళాలు, సీఎం సహాయనిధికి సినీ ప్రముఖుల విరాళాలు..
కరోనా వైరస్‌పై పోరాడేందుకు ప్రముఖ సంస్థల తమ ఉదారతను చాటుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విరాళాలు అందజేశాయి. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య రూ.31 లక్షల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ప్రకటించింది. ఆ సంస్థ అధినేత మంత్రి కేటీఆర్‌కు మంగళవారం చెక్కును అందజేశారు.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తల్లూరి సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు అందజేశారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రేయనక పగలనక కష్టపడుతోన్న వారి కోసం తన వంతుగా సాయం చేశానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా తనవంతు సాయం చేశానని ట్వీట్ చేశారు.

సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీకి శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత రూ.5 లక్షల విరాళం అందజేశారు. వైరస్‌కు మందులేదని.. సామాజిక దూరంతోనే తరిమికొట్టొచ్చని పేర్కొన్నారు. దీంతో కరోనా మహమ్మరిని తరిమికొట్టొచ్చని తెలిపారు. మరోవైపు హీరో గోపిచంద్ వెయ్యికి పైగా పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. వారికి స్వయంగా గోపిచంద్ అందజేశారు. పోసాని కృష్ణ మురళి కూడా ముందుకొచ్చారు. 50 మందికి నెలకు సరిపడ సరుకులు అందజేస్తానని ప్రకటించారు.