• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

|

వివాదాలను ఇంటిపేరుగా కొనసాగిస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి రాజకీయ నేతలను టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మినహా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మొదలుకొని అందరిపైనా ఇష్టారీతిగా కామెంట్లు చేసే ఆర్జేవీ.. తాజాగా హైదరాబాద్ మేయర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార టీఆర్ఎస్ నేరుగా స్పందించనప్పటికీ, నెటిజన్లు మాత్రం దర్శకుడికి దిమ్మతిరిగేలా తగులుకున్నారు..

  #rgv #gadwalvijayalakshmi Hyderabad kotta mayour gadwal vijaya lakshmi gurinchi Rgv Tweets - video viral

  నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?నిర్మల భర్త పరకాల ప్రభాకర్ సంచలనం -ప్రధాని మోదీ భయానక తప్పిదం -ఎల్బీ స్డేడియం, ప్రకాశం జిల్లా?

  మేయర్ వీడియో వైరల్..

  మేయర్ వీడియో వైరల్..


  కొద్ది రోజుల కిందటే జీహెచ్ఎంసీ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి.. తొలి ఇంటర్వ్యూలోనే ‘ఐదేళ్ల పాటు సిటీలో వరదలు రావొద్దు.. అనబోయి, వర్షాలు కురవొద్దని ప్రార్థిస్తున్నట్లు చెప్పడం విమర్శలకు తావిచ్చింది. సీటులో ఆమె ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారనగా, మేయర్ కు సంబంధించిన మరో వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది. విజయలక్ష్మి తన ఇంట్లో పెంపుడు కుక్కకు చపాతి తినిపిస్తూ, అదే చపాతిని తాను కూడా తింటోన్న దృశ్యాలను టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు వీడియోలు వైరలైన తర్వాత, ఆమెను మీడియా సంప్రదించగా, చిన్నప్పటి నుంచి పెంపుడు జంతువులంటే తనకు ఆసక్తి ఉందని, ఇప్పుడున్న పెంపుడు కుక్క.. చేత్తో తినిపిస్తే తప్ప ఆహారం తీసుకోబోదని మేయర్ చెప్పుకొచ్చారు. దీనిపై..

  విజయలక్ష్మి మందు కొట్టిందా?

  విజయలక్ష్మి మందు కొట్టిందా?

  పెంపుడు కుక్కకు హ్యాండ్ ఫీడింగ్ చేస్తోన్న మేయర్ విజయలక్ష్మి వీడియోలు వైరల్ కావడంతో, వాటిని మరోసారి షేర్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పలు అనుచిత కామెంట్లు చేశాడు. ‘‘గద్వాల్‌ విజయలక్ష్మీ మందుకొట్టి ఇలా కుక్కలపై ప్రేమ వలక పోస్తోందా లేక మందు తాగిన మందుతాగిన కుక్కతో ప్రేమలో ఉందా? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలానే ఆమె(మేయర్) ప్రజలను ప్రేమిస్తుందా? మేయర్‌ ఇలాంటి ప్రేమని నాపై కురిపిస్తానంటే నేను వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలని కోరుకుంటాను. ఈ దృశ్యాలను చూసి ఆమె ఫ్యామిలీ వాళ్లు, పార్టీ సభ్యులు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కచ్చితంగా అసూయ పడుతుండొచ్చు'' అని ఆర్జీవీ కామెంటాడు. అంతేకాదు..

  అంతర్జాతీయ కుక్కలకు మేయర్..

  అంతర్జాతీయ కుక్కలకు మేయర్..

  కుక్క పట్ల మేయర్ విజయలక్ష్మి శ్రద్ధను సెల్ఫ్‌ లెస్‌ లవ్‌కు నిదర్శనంగా ఆర్జీవీ పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ కుడి చేతితో కుక్కకి తినిపిస్తూ, తాను మాత్రం ఎడమ చేతితో తింటోంది. నిజంగా ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్ ను చేయాలి'' అని సెటైర్ వేశారు. వర్మ కామెంట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మేయర్ విజయలక్ష్మిని మందు కొట్టిందా? అనే ప్రశ్నలను ఆర్జీవీ మందుకొట్టి సంధించాడని కొందరు, కుక్కలపై మేయర్ ప్రేమను చూసి మనుషులు ఆత్మహత్య చేసుకునే పరిస్థతని ఇంకొందరు కామెంట్లు పెట్టారు. మేయర్ విజయలక్ష్మి మాత్రం ఆర్జీవీని లైట్ తీసుకున్నట్లున్నారు.

  English summary
  film maker Ram Gopal Varma recent satirical tweet on Hyderabad Mayor Gadwal Vijayalakshmi love for her pet dog has sparked a twitter outrage. reacting to a video of the Mayor feeding her pet dog, which surfaced on social media, rgv made series of tweets
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X