హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షేక్‌పేట్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన భారీ ముప్పు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ షేక్‌పేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆపై బంక్ మొత్తం వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు.

బంక్ పక్కన కాంప్లెక్స్‌లను అప్రమత్తం చేసిన అధికారులు

బంక్ పక్కన కాంప్లెక్స్‌లను అప్రమత్తం చేసిన అధికారులు

పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్,రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్‌ను అధికారులు అప్రమత్తం చేశారు. బంక్ పక్కనే ఉన్న రెండు కాంప్లెక్స్‌ల్లో ఇప్పటికే

జనాన్ని ఖాళీ చేయించారు. బంక్‌లో భారీగా నిల్వ ఉన్న పెట్రోల్‌కు మంటలు వ్యాపిస్తే ఊహించని స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందునా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.

 వెంటనే ఎమర్జెన్సీ అలారం మోగించడంతో

వెంటనే ఎమర్జెన్సీ అలారం మోగించడంతో

పెట్రోల్ బంక్‌లో మంటలు చెలరేగిన సమయంలో సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ అలారం మోగించారు. దీంతో మిగతా వాహనదారులు వెనువెంటనే బయటకు వెళ్లిపోయారు. బంక్‌లో ఒకే ఒక్కకారు మంటలకు ఆహుతి అయినట్టు సమాచారం.

 ట్రాఫిక్ మళ్లింపు

ట్రాఫిక్ మళ్లింపు

పెట్రోల్ బంక్ రోడ్డు పక్కనే ఉండటంతో.. అటువైపు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. టోలీచౌకీ,గచ్చిబౌలి వైపు నుంచి వస్తున్న వాహనాలను వేరే వైపు మళ్లిస్తున్నారు. పెట్రోల్ స్టోరేజీకి గనుక మంటలు వ్యాపిస్తే అటుగా వెళ్లే వాహనదారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందునా అక్కడి నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు.

మరిన్ని ఫైరింజన్లు రంగంలోకి దిగే అవకాశం

మరిన్ని ఫైరింజన్లు రంగంలోకి దిగే అవకాశం

అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే మొదట ఓ ఫైరింజన్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇంకా అక్కడ మంటలు అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో మరిన్ని ఫైరింజన్స్‌ను రప్పించే అవకాశం

కనిపిస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణమేంటన్నది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు దీనిపై ఆరా తీసే అవకాశం ఉంది.

English summary
A car caught on fire near a petrol bunk at Shaikpet in Hyderabad. The area scared of the fire accident which took place near the petrol bunk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X