my mom said# sam:పెళ్లికెందుకు తొందర, మంచిగా చదివించండి..సామ్
సమంత ప్రస్టెషన్ ఇంకా తగ్గనట్టు ఉంది. అందుకే తీర్థయాత్ర.. తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల వరసగా ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ట్వీట్ కూడా చేసింది. అదీ కాస్త వేదాంతం.. తన జీవితం ఇలా అయిపోయిందా అనే రీతిలో ఉంది. అమ్మాయిల పెళ్లి గురించి ఆమె కామెంట్ చేశారు. తొందరపడి చేయొద్దు అని.. చదివించాలని సూచించింది.

మై మామ్ సెడ్
చైతో విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత సమంత సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తోంది. నాగ చైతన్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంత మాత్రం తన పరిస్థితులను అన్వయించేలా రోజూ పోస్టులు చేస్తున్నారు. సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మై మామ్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం తను ఉన్న పరిస్థితులకు తగ్గట్టు పోస్టులు చేస్తున్నారు. ఇటీవల చార్ ధామ్ యాత్రకు వెళ్లానంటూ అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. యాత్ర ముగించుకొని వచ్చిన సమంత తాజాగా పెట్టిన ఓ పోస్టు మరోసారి వైరల్ అవుతుంది.

పెళ్లికెందుకు తొందర
ఇండియన్ ఉమెన్ హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్టుని షేర్ చేసింది. పెళ్లి గురించి కామెంట్ చేసింది. మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దాలని సూచించింది. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టాలని కోరింది. పెళ్లికి సిద్ధం చేసే ముందు.. తన కోసం తనని సిద్ధం చేయాలని కోరింది. తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించాలని కోరింది. ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తాను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయాలని తెలిపింది. పెళ్లి గురించి మాట్లాడటంతో మరోసారి సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విడాకులు బాధాకరమే..కానీ
అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతమ్ గే అని.. సమస్యే లేదని కొట్టి పారేశారు.