హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఫస్ట్ లోకల్ కేసు .. కేపీహెచ్‌బీలో మహిళకు కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కరోనా కేసులు 300కు చేరాయి. ఇక తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అయితే విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఇప్పటివరకు కరోనా సోకిందని తెలంగాణా ప్రభుత్వం , ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పిన పరిస్థితి. ఇక ఈ నేపధ్యంలో ఫస్ట్ టైమ్ లోకల్‌గా ఓ మహిళకు కరోనా సోకింది. దీంతో ప్రజల్లో మరింత టెన్షన్ పెరిగింది.

తెలంగాణాలో స్థానిక మహిళకు కరోనా .. మొదటి లోకల్ కేసు

తెలంగాణాలో స్థానిక మహిళకు కరోనా .. మొదటి లోకల్ కేసు

ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి కరోనా ఈజీగా వ్యాప్తి చెందుతుంది . అయితే కరోనా పాజిటివ్ ఉన్న సోదరుడి నుండి ఒక సోదరి కరోనా బారిన పడింది. ఇక ఇలా కరోనా రావటాన్ని ప్రైమరీ కాంటాక్ట్ అంటారు. పి-14 కేసు ద్వారా ఇది స్థానికంగా ఒకరికి అంటుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. కేపీహెచ్‌బీలోని ఫేజ్-2 లో నివసించే మహిళకు కరోనా సోకింది. ఇటీవలే బాధితురాలి సోదరుడు యూకే నుంచి వచ్చాడు. అతనితో కలిసి ఉన్న నేపధ్యంలో సోదరికి, ఆమె ఇంట్లో మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు కరోనా బాధితులు అందరూ విదేశాల నుండి వచ్చిన వారే

ఇప్పటివరకు కరోనా బాధితులు అందరూ విదేశాల నుండి వచ్చిన వారే

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన 21 కేసుల్లో కూడా అందరూ విదేశాల నుంచి వచ్చినవారే . ఇప్పుడు మాత్రం అలా వచ్చినవారి నుంచి ఫస్ట్ టైమ్ వైరస్ మరొకరికి అంటుకుంది. ఇది రాష్ట్రంలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు. ఇక దీంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తం అయ్యింది. అవసరం అనుకుంటే ఎలాంటి తక్షణ చర్యలైనా తీసుకుంటాం కానీ కరోనాతో పోరాడతాం అని ప్రకటించారు సీఎం కేసీఆర్ .

కరోనా నియంత్రణ దిశగా సర్కార్ అడుగులు

కరోనా నియంత్రణ దిశగా సర్కార్ అడుగులు

ఇప్పటికే కరోనా నియంత్రణకోసం చర్యలు చేపట్టిన తెలంగాణా సర్కార్ రేపు బస్సులను కూడా నిలిపివెయ్యనుంది. ఒకపక్క దేశం మొత్తం రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రేపు తెలంగాణలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కానున్నారు. అంతే కాదు అవసరం అనుకుంటే మొత్తం రాష్ట్రాన్నే షట్ డౌన్ చేసే ఆలోచనలో కూడా తెలంగాణా ప్రభుత్వం ఉంది.

 లోకల్ కేసు నమోదుతో ప్రజల్లో టెన్షన్

లోకల్ కేసు నమోదుతో ప్రజల్లో టెన్షన్


ఏది ఏమైనా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్తుంది సర్కార్ . ఇక ఈ నేపధ్యంలో ఒక లోకల్ కేసు నమోదు కావటం ప్రజలను టెన్షన్ పెడుతుంది. సమస్య తీవ్రతరం అవుతున్న భావన కలుగుతుంది.

English summary
Corona shows its presence in India. Corona cases have reached 300 in the country. In the state of Telangana, there were 21 cases of corona positive cases. Telangana government has been alerted. Telangana government and health department sources said that so far only corona is infected with foreigners. It is in this context that a woman first corona infected in local . This has caused more tension in the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X