• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

flashback 2019: దేశాన్ని కదిలించిన ‘దిశ’, ఒక చెడు ఆలోచనే ఐదు కుటుంబాల్లో తీరని శోకంగా..

|

హైదరాబాద్: శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నలుగురు దుర్మార్గులు ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెను దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ దారుణంపై తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను వెంటనే ఉరితీయాలని, ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి.

మంచితనమే చూసిన దిశ..

మంచితనమే చూసిన దిశ..

ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలిగా సేవలందిస్తున్నారు 26ఏళ్ల అమ్మాయి దిశ. ఈ ప్రపంచం మరీ ఇంత దారుణంగా ఉందని తెలియని అమాయకురాలు. అందరిలోనూ ఎంతో కొంత మంచితనం ఉంటుందని నమ్మిన ఓ యువతి. ఆమె నమ్మకమే ఆమెను కొందరు దుర్మార్గుల చేతిలో బలి కావాల్సిన పరిస్థితి తెచ్చింది.

నవంబర్ 27న రాత్రి.. ఆ చెడు ఆలోచన..

నవంబర్ 27న రాత్రి.. ఆ చెడు ఆలోచన..

2019, నవంబర్ 27న దిశ గచ్చిబౌలికి వెళుతూ శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద తన స్కూటీని పెట్టింది. అయితే, టోల్ ప్లాజా సిబ్బంది స్కూటీని దూరంగా పెట్టాలని సూచించడంతో ఆమె తన స్కూటీని టోల్ గేట్‌కు సమీపంలోనే కొంచెం దూరంలో పార్క్ చేసింది. ఆ సమయంలో అక్కడే లారీల్లో మద్యం తాగుతూ ఆమెను చూశారు నిందితులైన మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలు. అప్పుడు వారికి దుర్భిద్ధి పుట్టింది, చెడు ఆలోచన మొదలైంది. కాగా, నవంబర్ 27న సాయంత్రం 6గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా నుంచి గచ్చిబౌలికి ఓ టాక్సీలో వెళ్లిన దిశ.. తిరిగి రాత్రి 9గంటల ప్రాంతంలో తన స్కూటీ పార్క్ చేసిన తొండుపల్లి టోల్‌గేట్ వద్దకు వచ్చింది. అప్పటికే ఆమెపై దురాలోచనతో పక్కా ప్లాన్ వేసిన దుర్మార్గులు ఆమె స్కూటీ టైర్‌ను పంక్చర్ చేశారు. టైర్ పంక్చర్ కావడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంది దిశ.

ఆ దుర్మార్గాన్ని గుర్తించని దిశ..

ఆ దుర్మార్గాన్ని గుర్తించని దిశ..

ఆ సమయంలోనే ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరీఫ్ దిశ వద్దకు వచ్చి తమవాడు స్కూటీని బాగు చేయించుకుని తీసుకొస్తాడని చెప్పాడు. అప్పటికీ కొంత అనుమానం వచ్చినప్పటికీ ఆమె ఆ దుర్మార్గుల దురాలోచనను అంచనా వేయలేకపోయింది. సరేనని ఆమె స్కూటీ తాళంచెవిని నిందితుల్లో ఒకరికి ఇచ్చింది. దీంతో అతడు స్కూటీని తీసుకెళ్లాడు. ఈ సమయంలోనే తనకు భయమేస్తోందంటూ తన సోదరికి ఫోన్ చేసింది దిశ. అంతా చీకటిగా ఉందనడంతో టోల్ ప్లాజా వద్దకు వెళ్లి నిలబడాలంటూ దిశకు చెప్పింది సోదరి. అయితే, అక్కడ అంతా తననే చూస్తారంటూ దిశ అక్కడికి వెళ్లేందుకు సుముఖత చూపలేదు. ఈ క్రమంలోనే దిశకు మాయమాటలు చెప్పి లారీల వద్దకు తీసుకెళ్లాడు మహ్మద్ ఆరీఫ్. ఆలోపు స్కూటీని తీసుకెళ్లిన నిందితుడు తిరిగి వచ్చాడు. షాపులన్నీ మూసివున్నాయని చెప్పాడు. దీంతో మరోవైపు వెళ్లమని చెప్పాడు మహ్మద్ ఆరీఫ్. తాను వెళ్లిపోతానని చెప్పినప్పటికీ దిశను అక్కడినుంచి వెళ్లనివ్వకుండా.. తమవాడు బాగు చేయించుకుని వస్తాడని దిశను అక్కడే ఆపేశాడు మహ్మద్ ఆరీఫ్. ఈ సమయంలోనే బాధితురాలి ఫోన్ నెంబర్ కూడా మహ్మద్ ఆరిఫ్ తీసుకున్నాడు.

ఆ రాత్రి అత్యంత అమానవీయం..

ఆ రాత్రి అత్యంత అమానవీయం..

కొంతసేపటి తర్వాత స్కూటీని తీసుకొచ్చాడు నిందితుల్లో ఒకడు. ఆ తర్వాత మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలు దిశను బలవంతంగా చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లారు. ఆమె నోరు నొక్కి, కాళ్లు, చేతులు పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి, దారుణంగా ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి పలుమార్లు దారుణాన్ని కొనసాగించారు. ఆ దుర్మార్గులు కొనసాగించిన దారుణకాండతో దిశ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత దిశను ఓ లారీలో ఎక్కించుకుని బయల్దేరారు నిందితులు. మరో ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వెళ్లగా.. అనుమానం వచ్చి సిబ్బంది నిందితులకు పెట్రోల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో మరో పెట్రోల్ బంకులో పెట్రోల్ తీసుకున్న నిందితులు.. దిశ మృతదేహాన్ని దుప్పట్లలో చుట్టి.. చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగలబెట్టారు. పూర్తిగా కాలిందో లేదో అని మరోసారి వచ్చి చూశారు నిందితులు.

పోలీసుల నిర్లక్ష్యం కొంత..

పోలీసుల నిర్లక్ష్యం కొంత..

ఇది ఇలా వుండగా, నవంబర్ 27న రాత్రి తమ కూతురు ఇంటికి రాలేదంటూ దిశ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు మొదట తమ పరిధి కాదంటూ వారిని అటు ఇటూ తిప్పారు. అంతేగాక, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చివరకు ఓ కానిస్టేబుల్‌ను దిశ తండ్రి వెంటపంపి రహదారి వెంట గాలించారు. ఆ తర్వాత దిశ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. నలుగురు నిందితులను 24గంటల్లోపే అరెస్ట్ చేశారు పోలీసులు. మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగ రంగంలోకి దిగి దిశ హత్యాచారం కేసును పర్యవేక్షించారు. దిశ నిందితులను వెంటనే ఉరితీయాలంటూ.. ఎన్‌కౌంటర్ చేయాలంటూ హైదరాబాద్ తోపాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

పోలీసులపై దాడి చేసి పారిపోతుంటే..

పోలీసులపై దాడి చేసి పారిపోతుంటే..

మరోవైపు నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించారు పోలీసులు. ఈ క్రమంలోనే కేసు రీకన్‌స్ట్రక్చన్ కోసం ఘటన జరిగిన వారం రోజులకు శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. బాధితురాలికి సంబంధించిన సెల్‌ఫోన్, వాచీలను చూపిస్తామంటూ పోలీసులను అటూ ఇటూ తిప్పారు నిందితులు. ఆ తర్వాత కాసేపటికి పోలీసుల వద్ద నుంచి తుపాకీలు లాక్కుని, కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు నిందితులు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. నలుగురు నిందితులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్, హైదరాబాద్, తెలంగాణ పోలీసులపై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. అదే సమయంలో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి.

హైకోర్టుకు రీపోస్టుర్టం నివేదిక..

హైకోర్టుకు రీపోస్టుర్టం నివేదిక..

జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఎన్‌కౌంటర్‌ను సుమోటాగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో రీపోస్టుమార్టం నివేదికను అందించనున్నారు వైద్యులు. కాగా, సోమవారం(డిసెంబర్ 23) నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, నలుగురు నిందితులు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఒక చెడు ఆలోచన.. ఐదు కుుంబాల్లో తీరని శోకం.. ఒకవేళ..

ఒక చెడు ఆలోచన.. ఐదు కుుంబాల్లో తీరని శోకం.. ఒకవేళ..

దిశ ఘటన: మంచి భవిష్యత్ ఉన్న ప్రభుత్వ వైద్యురాలైన ఒక అమ్మాయి జీవితం అత్యంత దారుణ పరిస్థితిలో ముగిసింది. త్వరలో పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని కలలు కంటున్న దిశ తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది. ఇక నలుగురు నిందితులు కూడా తమ కుటుంబాలను పోషించుకునేందుకు కష్టపడేవారే. కానీ, వారికి వచ్చిన చెడు ఆలోచనే వారి జీవితాలకు అర్ధాంతరంగా ముగింపు పలికింది. ఇక వారినే నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య గర్భిణి కావడం గమనార్హం. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ నిందితుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఒక చెడు ఆలోచనతో పుట్టిన దుర్భిద్ది చివరకు ఐదు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వారి(నిందితుల)కి ఆ చెడు ఆలోచనే రాకుంటే ఇప్పుడు ఈ ఐదు కుటుంబాలు కూడా తమ జీవితాలను ఎంతో సంతోషంగా గడిపేవే కదా. ఈ ఏడాది జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఇది ఒకటిగా మారి ఉండేది కాదు కదా.

English summary
flashback 2019: Disha rape and murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X