హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో విదేశీ సెక్స్ రాకెట్: ఉపాధి అంటూ బంగ్లా యువతులతో వ్యభిచారం, రంగంలోకి ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో నగరంలో పలు సెక్స్ రాకెట్లను ఛేధించిన పోలీసులకు తాజాగా మరో భారీ సెక్స్ రాకెట్ సవాల్ విసిరింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న విదేశీ సెక్స్ రాకెట్‌ను నగర పోలీసులు తాజాగా ఛేదించారు. నిర్వాహకులతోపాటు పలువువు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉపాధి పేరుతో..

ఉపాధి పేరుతో..

ఉద్యోగం, పని ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను అక్కడి సెక్స్ రాకెట్ నిర్వాహకులు.. హైదరాబాద్ తీసుకువస్తున్నారు. నెల రోజులపాటు అటు ఇటు తిప్పి పనులు దొరకడం లేదంటూ వారిని బలవంతంగా సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు. వారితో ఇక్కడే వ్యభిచారాన్ని చేయిస్తున్నారు.

రెండు ముఠాల అరెస్ట్..

రెండు ముఠాల అరెస్ట్..

ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఛత్రినాక, మొఘల్‌పుర పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొస్తున్న సీమా బెహ్రా, రాజేష్ దేవనాథ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బంగ్లదేశ్ నుంచి హైదరాబాద్‌కు..

బంగ్లదేశ్ నుంచి హైదరాబాద్‌కు..

హైదరాబాద్ నగరంలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఉపాధి తొందరగా లభిస్తుందంటూ నమ్మించి బంగ్లాదేశ్‌లోని అమాయక యువతులను సీమా బెహ్రా, రాజేష్ దేవనాథ్, రషీద్ అలీలు నమ్మించి ఇక్కడికి తీసుకువస్తారు. తీసుకొచ్చినప్పుడల్లా ఐదారుగురు యువతులను తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ యువతలతో మాల్దా వద్ద సరిహద్దు దాటిన తర్వాత హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ చేరుకుంటారు.

బలవంతంగా సెక్స్ వర్కర్లుగా..

బలవంతంగా సెక్స్ వర్కర్లుగా..

ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులపాటు ఆ యువతులకు మంచి భోజనం పెట్టి.. బాగా చూసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ పనులు దొరకడం లేదంటూ బలవంతంగా వారిని వ్యభిచార కూపంలోకి నెడతారు. ఏం చేయాలో తెలియని ఆ యువతులు నిస్సాహస్థితిలో సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. పొరుగుదేశం నుంచి ఉపాధి కోసం వచ్చిన యువతులకు ఇక్కడ ఇచ్చేది కేవలం రూ. 200 మాత్రమే కావడం గమనార్హం.

యువతులకు నిర్వాహకుల బెదిరింపులు..

యువతులకు నిర్వాహకుల బెదిరింపులు..


కాగా, ఉచితంగా వసతి, భోజనం పెడుతున్నాం కాదా ఇంకేం కావాలంటూ సెక్స్ రాకెట్ల నిర్వాహకులు యువతులను బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. ఈ నిర్వాహకుల నుంచి బయటపడ్డ బాధిత యువతులు పోలీసులకు తమ మొరను వినిపించారు. ఇప్పటి వరకు 9మంది యువతులను సెక్సె రాకెట్ నిర్వాహకుల బారి నుంచి కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సిట్ విచారిస్తోందని చెప్పారు.

పరారీలో ప్రధాన నిందితుడు.. రంగంలోకి ఎన్ఐఏ

పరారీలో ప్రధాన నిందితుడు.. రంగంలోకి ఎన్ఐఏ

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అమిన్‌ధాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్ నుంచి యువతుల అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలి కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఉగ్ర కోణం ఏమైనా ఉందా? అనే విషయంపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

English summary
Foreign sex racket busted in hyderabad, organisers arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X