హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం మరింత విషమం .. వైద్యానికి స్పందించని పరిస్థితి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది .గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సెప్టెంబర్ 28వ తేదీన నాయిని నరసింహా రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య చికిత్స అనంతరం ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించింది.కరోనా తగ్గిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అనారోగ్యం ఆయనను వెంటాడింది. దీంతో మళ్ళీ ఆస్పత్రికి తీసుకువచ్చారు .

ఆయనకు శ్వాసకోశ సబంధిత ఇబ్బందిని గుర్తించిన వైద్యులు న్యుమోనియాతో బాధ పడుతున్నట్టు తేల్చారు . దీంతో ఆయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోవటం తో ఆయన వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు . కానీ ప్రస్తుతం ఆయన వైద్యానికి కూడా స్పందించడం లేదన్న సమాచారం ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. నాయిని నర్సింహా రెడ్డికి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

former Home Minister Naini Narasimha reddy helath condition is more critical

ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇప్పటికే మంత్రి కేటీఆర్ , హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు నాయిని నరసింహారెడ్డిని పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులను అడిగి నాయిని పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యానికి కూడా స్పందించలేని విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నాయిని నరసింహారెడ్డి ని కాపాడడం కోసం వైద్యులు శ్రమిస్తున్నారు.

Recommended Video

P Govt Decides To Distribute Essentials To Flood Affected People For Free | AP Floods

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు .

English summary
Former Telangana Home Minister Naini Narasimha Reddy's health condition seems to be deteriorating .He has been admitted to the Apollo Hospital in Hyderabad for treatment .He has not responded to medical treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X