• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో

|

''చంచల్‌గూడ జైలులో నాగరాజును ఉంచిన బ్యారెక్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం? అది కూడా ఓ మొద్దు టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు? ఆ సమయంలో పక్కనున్న ఖైదీలు ఏం చేస్తున్నట్లు? చనిపోయినరోజు ఉదయమే ఆయన మాతో ఫోన్లో మాట్లాడారు. ఇది కచ్చితంగా ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే అని మేం నమ్ముతున్నాం..'' అంటూ సంచలన ఆరోపణలు చేశారు దివంగత తహసీల్దార్ నాగరాజు కుటుంబీకులు.

సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ

 సీబీఐ విచారణకు డిమాండ్..

సీబీఐ విచారణకు డిమాండ్..

ఓ భూవివాదంలో భారీస్థాయిలో రూ.1.10కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహసీల్దార్‌ నాగరాజు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగం కోల్పోయి, రిమాండ్ ఖైదీగా హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న ఆయన.. ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడ్డారు. జైలు బ్యారెక్ లో టవల్ తో ఉరి పెట్టుకుని నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతోన్న పోలీసులు.. కస్టోడియల్‌ డెత్‌గా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నాగరాజు మృతిపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు.. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తామని చెప్పారు.

ఇదీ అసలు వాస్తవం అంటూ..

ఇదీ అసలు వాస్తవం అంటూ..

‘‘చనిపోడానికి ముందు ఉదయం నాగరాజు మాతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తనపై ఏసీబీ నమోదు చేసింది తప్పుడు కేసు అనడానికి మా వద్ద తగిన ఆధారాలున్నాయి. ఇప్పటికే సీసీటీవీ వీడియో ఫుటేజీలను ఏసీబీ కోర్టుకు అందజేశాం. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో నాగరాజు ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయనను కేసులో ఇరికించారు. జైలులో ఆయన చనిపోయిన తీరుపై మాకు అనుమానాలున్నాయి. అది హత్య అయి ఉండొచ్చని మా నమ్మకం. ఈ ఘటనను హత్య కేసుగా నమోదుచేసి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి'' అని నాగరాజు కుటుంబీకులు వ్యాఖ్యానించారు.

 ఏసీబీ విచారణలో ఏం జరిగింది?

ఏసీబీ విచారణలో ఏం జరిగింది?

నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కుటుంబీకులు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుండగా.. కస్టోడియల్ డెత్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నాగరాజు ఆత్మహత్యకు ముందు కొన్ని రోజులు ఏసీబీ అధికారుల కస్టడిలోని ఉన్నారు.. నాగరాజును ఏసీబీ విచారించిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు జైలు సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. నాగరాజు కుటుంబీకుల ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

  Sunisith అరెస్ట్, Views కోసం ఇంటర్వూ చేసిన అందరి పై చర్యలు - Police || Oneindia Telugu

  కరోనాపై మరో షాకింగ్: రెమ్‌డెసివిర్ పనిచేయట్లేదు - మరణాలు పెరగొచ్చన్న WHO - గిలిద్ ఖండన

  English summary
  former Keesara tahsildar Nagraj family members have expressed suspicions over the suicide incident. they alleged that Nagraju did not commit suicide, may be he was murdered. The family members said they would file a petition in the high court seeking a CBI inquiry into Nagraj's death. Former Keesara Tahsildar Nagaraju who was caught by the Anti-Corruption Bureau while taking bribe committed suicide by hanging himself in Chanchalguda jail on Tuesday night.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X