హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కేసీఆర్‌తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్‌పై చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన్నికల ట్రబుల్ షూటర్ హారీష్ రావుతోపాటు మాజీ ఎంపీ కవిత, ఇతర నేతలతో ఆయన సమావేశం అయ్యారు.కాగా మూడు గంటలపాటు ఎన్నికల ఓటమీకి గల కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది.

కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హారీష్ రావు పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలలుగా జరుగుతున్న స్థానిక సంస్థలతోపాటు ఎంఎల్‌సీ ఎన్నికల్లో కూడ ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మరోవైపు ఆయన మొదటి ధపాలో మంత్రిపదవి కూడ దక్కలేదు. ఈనేపథ్యంలో కేటీఆర్‌కు పూర్తి బాద్యతలు అప్పగించిన కేసీఆర్ ఎన్నికల సమీక్షలకే పరిమితమయ్యారు..

former minister harish rao met with cm kcr

ఇక హరీష్ అయిదు నెలలుగా పార్టీకి దూరంగా ఉండడంతో ఆయనపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన చాలసార్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడ హరీష్ రావుకు మెదక్ పార్లమెంట్ స్థానం ఇంచార్జీగా అప్పగించారు. దీంతో ఆయన అభ్యర్థిని గెలిపించుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారు.దీంతో నిజామాబాద్‌లో గడ్డు పరిస్థితులు ఉన్న సరైన నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో మాజీ ఎంపీ కవిత సీఎం కూతురే స్వయంగా ఓడిపోవడం పార్టీపైన ,కేసీఆర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇక చాల కాలం తర్వాత హరీష్ రావతో సీఎం భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
trs party trouble shooter former minister harish rao met with cm kcr for discussion about parlament elections defeat today eveing at cm camp office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X