హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబీ పార్టీకి కొత్త ఓనర్ ... ఈ అసమ్మతి చల్లారదా ?

|
Google Oneindia TeluguNews

గులాబీ గూటిలో మరో అసమ్మతి గళం వినిపించింది. మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్ ఆతర్వాత రసమయి బాలకిషన్ ఇక తాజాగా మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సీఎం కేసీఆర్ పై తన నిరసన గళాన్ని వినిపించారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పారని ఆయన మండిపడ్డారు.

 మంత్రి పదవి ఇస్తానన్నారు..కేసీఆర్ మాట తప్పారు : నాయిని అసంతృప్తి పీక్..!! మంత్రి పదవి ఇస్తానన్నారు..కేసీఆర్ మాట తప్పారు : నాయిని అసంతృప్తి పీక్..!!

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి .. కేసీఆర్ పై నిరసన సెగ

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి .. కేసీఆర్ పై నిరసన సెగ

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్ గులాబీ జెండా లకు ఓనర్ లమని , ఎవరి దయాదాక్షిణ్యాలతో మంత్రి కాలేదని మాట్లాడితే, ఇక తాజాగా రసమయి బాలకిషన్ మెరిట్ ఉన్న వారు రాజకీయాల్లో ఉండాలి కానీ మెరిట్ లేనివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇక తాజాగా తాను కూడా గులాబీ పార్టీ ఓనర్ నేనని , కిరాయికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తానని మంత్రులను ఉద్దేశించి చేసిన నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ ఎంత వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నాయి .

 మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారని కేసీఆర్ పై మాజీమంత్రి నాయిని మండిపాటు

మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారని కేసీఆర్ పై మాజీమంత్రి నాయిని మండిపాటు

గత టర్మ్‌లో నాయిని నర్సింహరెడ్డి హోం మంత్రిగా పని చేశారు. ఈ దఫా నాయిని నర్సింహరెడ్డికి కేసీఆర్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడిన నాయిని నరసింహారెడ్డి సీఎం కేసీఆర్తనకు ఇచ్చిన మాటను తప్పారని , ఇక ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో నూ తనకు అన్యాయం చేశారని పేర్కొన్నారు.గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వాలనిసీఎం కేసీఆర్ వద్దనాయిని నర్సింహరెడ్డి టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. కానీ ఆ సీటును ముషీరాబాద్ అసెంబ్లీ సీటును టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ముఠా గోపాల్ కు ఇచ్చారని ఆవేదన చెందారు . ఈ సమయంలో తనకు ఇచ్చిన హమీని నెరవేర్చలేదని కేసీఆర్ పై నాయిని నర్సింహ రెడ్డి మండిపడ్డారు.

కార్పోరేషన్ చైర్మన్ ఎవరికి కావాలి అని మాజీ మంత్రి విసుర్లు

కార్పోరేషన్ చైర్మన్ ఎవరికి కావాలి అని మాజీ మంత్రి విసుర్లు

ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇస్తారని తాజాగా ప్రచారం జరుగుతున్న నేపద్యంలో తనకు ఏ కార్పోరేషన్ పదవి వద్దని నాయిని నర్సింహరెడ్డి తేల్చి చెప్పారు.
హోం మంత్రి పదవి నిర్వహించిన తాను కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చేస్తానా అని నాయిని నరసింహారెడ్డి ప్రశ్నించారు. కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి ఎవరికి కావాలని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్‌కు తాను కూడ ఓనర్‌నేనని ఆయన చెప్పారు. కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు. ఇప్పుడు తాజాగా మంత్రులుగా కొలువుతీరిన వారిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు నాయిని నరసింహారెడ్డి. మొత్తానికి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలతో టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తీరుపై మరో నిరసనగళం బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది.

English summary
Naini Narasimha Reddy has said that he will not take up the post of any corporation chairman in the context of the recent campaign .Naini Narasimha reddy questioned whether he would be appointed as the Chairman of the Corporation after he was appointed as Home Minister. He said he was also the owner of the TRS. The tanents do not know when to turn down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X