హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసులపైనే పోలీసులకు మళ్ళీ మళ్ళీ ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పోలీసులపైనే పోలీసులకు మళ్ళీ మళ్ళీ ఫిర్యాదు చేస్తున్నారు. . చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ వారంట్ జారీ కావటం , ఆయన అజ్ఞాతంలో ఉండటం అందరికీ తెలిసిందే . అయితే తనతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, తిరిగి తనపైనే తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఇప్పుడు కూడా పోలీసులకు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తున్నారు.

అమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డుఅమిత్ షా తో భేటీ అయిన వివేక్ ... లైన్ క్లియర్ ... కానీ అదే అడ్డు

 సైబరాబాద్ పోలీసులపై ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సైబరాబాద్ పోలీసులపై ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సైబరాబాద్‌ పోలీసులపై ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించిన పోలీసు సిబ్బంది తనపై దాడికి యత్నం చేశారు. ఇక ఆ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో మళ్లీ రెండోసారి ఫిర్యాదు చేయడానికి వచ్చానన్నారు. ఎన్నికల సమయంలో సైబరాబాద్‌ పోలీసులు తనతో ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టిన ఆయన నేను వారిని విడిచిపెట్టేది లేదంటూ వారి మీద పదేపదే ఫిర్యాదు చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపణ

ఎన్నికల సమయంలో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపణ

ఎన్నికల సమయంలో కోర్టు అనుమతి లేకుండా సైబరాబాద్‌ పోలీసులు తన ఇంట్లోకి, ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించారని, తనతోబాటు సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించారన్నారు. అదే సమయంలోనే ఫిర్యాదు చేస్తే పోలీసులను నిర్బంధించి కొట్టానని తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోని కారణంగా మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చానని ఆయన తెలిపారు. ఈ సంఘటనలో తప్పు ఎవరిదనే విషయాన్ని తేల్చాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

పోలీసులను బంధించి చిత్ర హింసలు పెట్టారని కొండాపై ఎన్నికల ముందు కేసు

పోలీసులను బంధించి చిత్ర హింసలు పెట్టారని కొండాపై ఎన్నికల ముందు కేసు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో ఆయన అనుచరుడైన సందీప్ రెడ్డి దగ్గర దొరికిన నగదుకు సంబంధించి అంశంపై నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో తమను బంధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్రహింసలు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Congress leader Konda Vishweshwar Reddy has repeatedly lodged a complaint on the police. . Former MP Konda Vishweshwar Reddy is known for the case about the harrasment of polcie. However, he is still complaining to the police that the police have acted inappropriately with him and that he has repeatedly misrepresented himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X