హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రికెటర్ నాగరాజు మళ్లీ బుసకొట్టాడు -ఈసారి మంత్రి కేటీఆర్ పీఏనంటూ -బ్యాటింగ్‌లో గిన్నిస్ రికార్డు

|
Google Oneindia TeluguNews

చిన్నప్పటి నుంచే ఆటలపై మక్కువ పెంచుకున్నాడు... పదేళ్ల కిందట ఆంధ్రా రంజీ క్రికెట్ జట్టులో అతనో మంచి ఆటగాడు.. సుదీర్ఘసమయం బ్యాటింగ్ చేసిన గిన్నిస్ రికార్డు కూడా అతని పేరిట ఉంది.. క్రేజ్ తోపాటు డబ్బులూ పెరిగాయి.. దాంతో మనోడు పక్కదారి పట్టి ఆటను నిర్లక్ష్యం చేశాడు.. విలాసవంతమైన జీవితం కోసం నలుగురి నెత్తిన చేతులు పెట్టడం అలవాటు చేసుకున్నాడు.. అతని పేరు బుడమూరు నాగరాజు.. సొంతూరు శ్రీకాకుళం.. ఉండేది భాగ్యనగరం..

కొవిడ్-19 వ్యాక్సిన్: మరో గుడ్‌న్యూస్ -94.5శాతం ఎఫెక్టివ్‌గా మోడెర్నా వ్యాక్సిన్ -డిసెంబర్ నుంచే.. కొవిడ్-19 వ్యాక్సిన్: మరో గుడ్‌న్యూస్ -94.5శాతం ఎఫెక్టివ్‌గా మోడెర్నా వ్యాక్సిన్ -డిసెంబర్ నుంచే..

మంత్రి కేటీఆర్ పేరుతో..

మంత్రి కేటీఆర్ పేరుతో..


తెలంగాణ మున్సిపల్,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని, మంత్రి పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘నేను మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిని మాట్లాడుతున్నాను... పేదవాడైన ఒక జూనియర్‌ క్రికెటర్‌కు మీరు సహాయం చేయాలి..'' అంటూ బోగస్‌ కాల్‌ చేసి ఓ డ్రగ్స్ ఫార్మా కంపెనీకి టోకరా వేసే ప్రయత్నం చేశాడు. అతను మాట్లాడిన తీరుపై అనుమానంతో సదరు ఫార్మా కంపెనీ వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ..

చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్చంద్రబాబు ముందుచూపు -పనబాక లక్ష్మికే టీడీపీ టికెట్ -బీజేపీకి చెక్ -రసవత్తరంగా తిరుపతి బైపోల్

లక్షల్లో డబ్బులు వసూలు..

లక్షల్లో డబ్బులు వసూలు..


తాజాగా మంత్రి కేటీఆర్ పేరు వాడుకుని మోసానికి ప్రయత్నించిన నాగరాజు గతంలోనూ ఇలాంటి పథకాలతోనే లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఇతనిపై తెలంగాణ, ఏపీలో పలు కేసులు ఉన్నాయి. పొల్యూషన్ బోర్డ్ నోటీసులు ఇవ్వకుండా చూస్తానని ఓ ఫార్మా కంపెనీ వద్ద రూ.15లక్షలు స్వాహా చేసినట్లు ఇదివరకే కేసు నమోదైంది. ఓ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు గత ఏడాది డిసెంబర్‌ 16న ఫోన్‌కాల్‌ చేసి.. ‘ఏపీకి చెందిన ఓ పేద క్రికెటర్ అండర్‌ 25 ప్రపంచకప్ కు ఎంపికయ్యాడని.. తక్షణ సాయంగా రూ.3.3 లక్షలు కావాలని మోసపుచ్చే ప్రయత్నం చేశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్ ఉదంతంతో..

ఎమ్మెస్కే ప్రసాద్ ఉదంతంతో..

బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్, ఆంధ్రా మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్ పేరు వాడుకుని మోసాలు చేసిన ఘటనలో నాగరాజు పేరు బాగా పాపులర్ అయింది. తాను ఎమ్మెస్కే ప్రసాద్ నని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.2.88 లక్షలు వసూలు చేయడం, ఓ సొసైటీ నుంచి రూ.3.88 లక్షలు తీసుకోవడం లాంటివి చేశాడు. సదరు ఘటనలపై ఎమ్మెస్కేకు ఫోన్ల మీద ఫోన్లు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటి ఘటనలకు సంబంధించి ఏపీ పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. తరచూ బెయిల్ పై బయటికొస్తూ నాగరాజు కాట్లు వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. నిజానికి..

Recommended Video

Captain Rohit Sharma Is A Mix Of MS Dhoni And Sourav Ganguly | Oneindia Telugu
82గంటల బ్యాటింగ్ రికార్డు..

82గంటల బ్యాటింగ్ రికార్డు..

ప్రస్తుతం నాగరాజు వయసు 25 ఏళ్లు. గతంలో అతనితో క్రికెట్ ఆడినవాళ్లంతా టీమిండియాలోకో, ఐపీఎల్ లోకో ప్రయత్నాలు చేస్తుండగా ఇతను మాత్రం పక్కదారి పట్టి కెరీర్ ఆగం చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేటకు చెందిన నాగరాజు ఎంబీయే పూర్తిచేశాడు. క్రికెటర్ గానూ అద్భుతంగా రాణించాడు. 2006లో అండర్-14 విశాఖ జట్టుకు ఎంపికై సత్తా చాటాడు. 2014లో ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికై పలు మ్యాచ్ లు ఆడాడు. అంతేకాదు, 2016లో ఏకధాటిగా 82 గంటల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. అప్పట్లో సదరు వార్త సంచలనం రేపింది. నాగరాజు టాలెంట్ చూసి అనేక ఎన్జీవోలు ఆర్థికసాయం చేసి ప్రోత్సహించేందుకు ముందుకొచ్చాయి. ఆ డబ్బును కెరీర్ కోసం కాకుండా జల్సాలకు వాడటంతో చివరికిలా నేరస్తుడయ్యాడు..

English summary
Former Ranji cricketer budumuru Nagaraju (25) has been arrested by the hyderabad police on monday. police told that nagaraju attempted to dupe businessman by using minister kcr's name. Several cases have been registered against him in the past as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X