హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలరాం నాయక్‌కు ఈసీ షాక్.. మూడేళ్లు పోటీకి దూరం, అనర్హత వేటు

|
Google Oneindia TeluguNews

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్‌.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది.

బలరాం నాయక్ మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయారు. ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.

former union minister balaram nayak banned: cec

నిర్ణీత గడువులోగా ఖర్చుల వివరాలను సమర్పించలేదు. దీనిని ఈసీ తీవ్రంగా పరిగణించింది. బలరాం నాయక్‌పై చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం విధించింది. బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న.. అంత యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయనకు ఈసీ షాక్ ఇచ్చింది.

English summary
former union minister balram naik has been banned for three years for election contestant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X