హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కోతలు లేవు!

|
Google Oneindia TeluguNews

మెదక్: జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకింది. మొదట కుటుంబ యాజమానికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా, ఆ తర్వాత అతని కుటుంబసభ్యులందరికీ పరీక్షలు నిర్వహించడంతో వారిలో శుక్రవారం మరో ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

నిజాముద్దీన్ నుంచి వచ్చి..

నిజాముద్దీన్ నుంచి వచ్చి..

మెదక్ పట్టణంలోని ఆజంపురకు చెందిన 56ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి మార్చి 21న స్వస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అతడ్ని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపి నమూనాలు పరీక్షించగా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ అధికారులు అతడి కుటుంబసభ్యులందరికీ బుధవారం మెదక్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు.

ఒకే కుటుంబంలో నలుగురికి.. 12 మంది క్వారంటైన్..

ఒకే కుటుంబంలో నలుగురికి.. 12 మంది క్వారంటైన్..

కాగా, శుక్రవారం అక్కడి నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు రిపోర్టు వచ్చింది.
పాజిటివ్ వచ్చిన వ్యక్తి భార్య, కుమార్తె, కోడలికి ఈ కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలిందని మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చెందిన 12 మంది కుటుంబసభ్యులను కూడా పాపన్నపేట మండలం ఏడుపాయల హరితహోటల్‌లోని ప్రభుత్వ క్వారంటైన్లో వసతి కల్పించారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని సికింద్రబాద్ గాంధీ ఆస్పత్రికి తరించారు. కాగా, తెలంగాణ ఇప్పటికే 150కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 9 మరణాలు సంభవించాయి.

Recommended Video

Asaduddin Owaisi Urges People to Follow Health Ministry Guidelines
వైద్యులు, పోలీసుల జీతాల్లో కోతలు లేవు..

వైద్యులు, పోలీసుల జీతాల్లో కోతలు లేవు..

ఇది ఇలావుండగా, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వైద్యారోగ్య, పోలీస్ శాఖల ఉద్యోగులకు వేతనం చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారికి జీతాల కోత నుంచి మినహాయింపును ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

English summary
Four Corona Positive Cases in One Family in Medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X