ఆటో ఎక్కడమే పాపమైపోయిందా..? మహిళపై డ్రైవర్ సహా నలుగురు గ్యాంగ్ రేప్
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన సరే.. కొందరిలో మార్పు రావడం లేదు. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు.. తినేయాలని చూస్తున్నారు. అవును రోజుకోచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వెలుగుచూడగా.. మరికొన్ని కనుమరుగు అవుతున్నాయి. వాటి లెక్క లేదు అదీ వేరే విషయం అనుకో.. ఇక జరుగుతున్న ఇన్సిడెంట్స్ మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అవును పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా రేపిస్టులు రెచ్చిపోతున్నారు. గ్యాంగ్ రేపులకు పాల్పడి భయాందోళన కలిగిస్తున్నారు. మహిళ కనిపిస్తే చాలు.. ఆ చూపుతోనే చూసి అనుభవించడానికి సిద్దం అవుతున్నారు.

గ్యాంగ్ రేప్..
విశ్వనగరం హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కలకలం సృష్టిస్తోంది. ఆటో ఎక్కిన మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను దింపాల్సిన చోట కాకుండా ఆటో డ్రైవర్ మరో చోటుకు తీసుకెళ్లి.. అక్కడ తన స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నాడు.

ఆటోలో ఎక్కితే
జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు కోఠిలో ఆటో ఎక్కారు. అయితే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లకుండా సిటీలో వివిధ మార్గాల్లో తిప్పుతూ చివరికి గాయత్రినగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతం చూసి మహిళను బలవంతంగా లాక్కెళ్లి మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. ఒకరి తర్వాత ఒకరు లైంగిదాడికి పాల్పడ్డారు. నలుగురికి చిక్కిన ఆ మహిళ భయపడుతూనే ఉంది.

బతుకు జీవుడా అంటూ..
ఎలాగో.. అక్కడి నుంచి మహిళ పారిపోయింది. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. తర్వాత మీర్‌పేట పోలీసులకు జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్‌ను కర్మన్ఘాట్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకడు పరారీలో ఉన్నారు. వీరి నేర చరిత్రను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయినా మారని వైనం
నిర్భయ, అభయ.. దిశ ఎందరో అభాగ్యులు తమ జీవితాలను కోల్పోయారు. రేపిస్టుల బారినపడి మాన.. ప్రాణాలను కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో యావత్ జాతి స్పందించింది. కానీ ఆ తర్వాతే మిన్నకుండిపోయింది. చాలా సందర్భాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి.. నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు. కానీ మిగతా మూర్ఖుల్లో మాత్రం మార్పు రావడం లేదు.