హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చింది.. ఉచిత మంచినీటి పథకం ప్రారంభం: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌కు రెండురోజుల ముందే సంక్రాంతి వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తాగునీటి పథకాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌ నగర్‌లో ప్రారంభించారు. తను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని చెప్పారు. కానీ ఇప్పుడు ఉచితంగా మంచినీరు అందజేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. పేదలందరూ అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recommended Video

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉచిత తాగునీటి ప‌థ‌కం ప్రారంభ‌ం

ఒక్కో కుటుంబానికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బస్తీల్లోని నల్లాలకు మీటర్లు లేకున్నా నీరు అందజేస్తామని చెప్పారు. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం మీటర్ తప్పనిసరి అని స్పష్టంచేశారు. 20 వేల లీటర్ల వినియోగం దాటితే పాత చార్జీలతో జలమండలి బిల్లు వసూల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఉచిత పథకం అమల్లోకి వస్తుంది.

free water scheme launch in hyderabad

జలమండలికి గ్రేటర్‌లో మొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 2.37 నల్లాలకే మీటర్లు ఉన్నాయి. ఉచిత మంచినీటి పథకంతో లబ్దిదారులకు 19.92 కోట రూపాయలు ఆదా అవనుంది. ఇటు బస్తీలోని పేదలకు అన్నీ సౌకర్యాలు కల్పించామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. బలహీనవర్గాల పిల్లలను విదేశాలను పంపిస్తున్నామని తెలిపారు.

English summary
free water scheme launched by municipal minister ktr in hyderabad jubilee hills constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X