హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇకపై బస్ స్టాండ్ లలో ఫ్రీ వైఫై .. బీఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ

|
Google Oneindia TeluguNews

ప్రపంచీకరణ నేపథ్యంలో మన జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా , మన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలన్నా , ఉద్యోగ వ్యాపారాలు చెయ్యాలన్నా అన్నిటికి ఇంటర్నెట్ అవసరమవుతుంది. ప్రజలకు ఉన్న ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన ఆర్టీసీ స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

Free WiFi in Bus Stands .. RTC, which talks with BSNL

ఆర్టీసీ తన ఐటీసేవలను త్వరలో ప్రారంభించనుంది .

ఇప్పటికే రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బస్టాండ్ లలో సైతం ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. దీనికోసం బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతోంది ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా 8 స్టేషన్లలో అందించాలని చూస్తోంది. తొలుత ఈసీఐఎల్, దిల్ సుఖ్ నగర్, పటాన్ చెరువు వంటి 8 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 358 బస్సు స్టాండ్ లలోనూ, హైదరాబాద్ వరంగల్ వంటి మహానగరాల్లో 1124 బస్ షెల్టర్లు ఉండగా వాటిలో ప్రయాణికుల రద్దీని ప్రామాణికంగా తీసుకొని ప్రధానమైన స్టేషన్లలో ఈ వైఫై సేవలను అందించాలని నిర్ణయించుకుంది టి ఎస్ ఆర్ టి సి. ప్రస్తుతం ఈ విషయంలో బిఎస్ఎన్ఎల్ తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఐటీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.

English summary
Telangana state RTC will bring free WiFi services in the bus stands . RTC is holding discussions with BSNL for this. Experimentally in 8 stations. Initially, free WiFi services will be launched in eight bus stations like ECIL, Dil Sukh Nagar and Patan cheruvu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X