హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయారెడ్డి ఎఫెక్ట్.... రెవెన్యూ కార్యాలయాల వద్ద ఫుల్ సెక్యూరిటీ...

|
Google Oneindia TeluguNews

అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి పై అకస్మిక దాడితో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్‌లో అలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. విజయారెడ్డి ఘటన తర్వాత ఆందోళనబాట పట్టిన రెవెన్యూ సిబ్బందికి పలు రక్షణ వలయాలు కల్పించింది. దీంతో గతంలో వలే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనుంది. పోలీసుల పహారతోపాటు సీసీ కెమేరాల పర్వేవేక్షణలో కార్యాలయాలు కొనసాగనున్నాయి.

 విజయారెడ్డి సజీవదహనం కేసు ... అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం విజయారెడ్డి సజీవదహనం కేసు ... అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం

 విజయారెడ్డి హత్యతో ఆందోళన

విజయారెడ్డి హత్యతో ఆందోళన

ప్రభుత్వ అధికారి దారుణంగా మృత్యువాత పడిన తర్వాత అటు ఉద్యోగులతో పాటు ఇటు ప్రభుత్వంలో మార్పులు చేటుచేసుకున్నాయి. ఇటివల జరిగిన అబ్దుల్లా‌పూర్ మేట్ తహాసీల్దార్ పై ఎలాంటీ రక్షణ లేకపోవడంతో ఆమె దారుణంగా హత్యకు గురయ్యారు. ఇందుకు కారణం కనీస రక్షణలు కూడ లేకపోవడమే... దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తమ రక్షణతోపాటు రెవెన్యూలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత తొమ్మిది రోజులుగా కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన బాట పట్టారు. దీంతో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడంతో వారు ఆందోళన విరమించి విధులో చేరారు.

సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు...

సీసీ కెమెరాలు, పోలీసుల బందోబస్తు...

దీంతో వారి భద్రతపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో ఇలాంట పరిణామాలు చోటు చేసుకోకుండా రెవెన్యూ శాఖ అదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఆయా ఎమ్మార్వోలు, ఆర్డీఓ కార్యాలయాల సమీపంలో అగ్నిమాపక పరికరాలు కూడ ఏర్పాటు చేయాలని సూచించింది. ముఖ్యంగా వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించింది. వాటిని వెంటనే కలెక్టర్ల వద్ద ఉన్న నిధుల్లో నుండ కొనుగోలు చేయాలని తెలిపింది.

ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

ఫిర్యాదులకు ప్రత్యేక సమయం

వాస్తవానికి విజయారెడ్డిని సజీవదహానం చేసిన సురేశ్ ఫిర్యాదుల దినం సోమవారం కావడంతో అదే అదనుగా ఆఫీస్‌లోకి పెట్రోల్ డాబ్బాతో నేరుగా వెళ్లాడు. ఫిర్యాదుల దినోత్సం కావడంతో కార్యాలయ సిబ్బంది సైతం ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. దీంతో అతి ఈజీగా తహసీల్దార్ గదిలోకి నేరుగా వెళ్లి పెట్రోల్ పోసీ నిప్పంచి తాపిగా బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సమయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. ఫిర్యాదుల సమయంలో రెవెన్యూ సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. చట్టాలపై అవగాహాన లేని ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు సమస్యను పూర్తిగా విని దాని పరిష్కారానికి కృషి చేయాలని సూచింంచింది.

English summary
The Revenue Department has directed the district collectors to take security measures at the revenue offices,to arrange police protection along with CC cameras
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X