నిధులు కేంద్రానివి.. ఫోటోలు కేసీఆర్వి: ఈటల రాజేందర్
వరి ధాన్యం కొనుగోళ్ల అంశం అగ్గిరాజేసింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారనిబీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్కు లేదన్నారు. నిధులు కేంద్రానివి.. ఫొటోలు కేసీఆర్వినని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు.
పథకాలు, ప్రలోభాలకు గురి చేసినా కూడా హుజురాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. తన గెలుపుతో కేసీఆర్కు నిద్ర పట్టడం లేదన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ రూ. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నేతలుగా ఎదిగే వారికి హుజురాబాద్ ఒక ప్రయోగశాలగా మారిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది అని ఈటల రాజేందర్ అంతకుముందు ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి అని పేర్కొన్నారు. అన్నీ అబద్దపు మాటలు అని విమర్శించారు.
దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.