• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లేటు వయసులో జాబ్ కోసం దరఖాస్తు చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్... అసలు ఎందుకిలా ?

|

తెలంగాణా ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ 73 ఏళ్ల వయసులో ఇప్పుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. అందరూ షాక్ అయ్యే విషయం ఏంటంటే తనకు ఉద్యోగం కావాలంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి కి గద్దర్ దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.

మౌనం వీడిన గద్దర్ .. తెలంగాణలో మరో ఉద్యమం అన్న ప్రజా యుద్ధనౌక

ఉద్యోగం కావాలని దరఖాస్తు చేసుకున్న గద్దర్

ఉద్యోగం కావాలని దరఖాస్తు చేసుకున్న గద్దర్

ఆయన తన కలంతో,తన గళంతో ఎన్నో వేల మందిని చైతన్యవంతులను చేశారు. ఎన్నో వేల మందిని ఉత్సాహంతో ఉరకలు వేసేలా చేశారు. ప్రతి ఒక్కరిలోనూ విప్లవోద్యమ జ్వాలను రగిలించిన ఘనత ఒక గద్దర్ కే సొంతం. అలాంటి ప్రజా యుద్ధనౌక గద్దర్ తనకు ఉద్యోగం కావాలి అని దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను కళాకారుణ్ని.. పాటలు పాడుతా.. నాకో ఉద్యోగమివ్వండి.. అంటూ తెలంగాణ సాంస్కృతిక సారథికి ఆయన దరఖాస్తు చేసుకున్న తీరు ఒకసారిగా అందర్నీ షాక్ కు గురి చేసింది.

మాదాపూర్ లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జాబ్ కోసం దరఖాస్తు

మాదాపూర్ లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జాబ్ కోసం దరఖాస్తు

హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లిన 73 ఏళ్ల గద్దె నిర్ణీత నమూనాలో కాకుండా తన సొంత లెటర్ ప్యాడ్ పై ఉద్యోగానికి ఆయన దరఖాస్తు చేయడం గమనార్హం. తన వయసు 73 ఏళ్లని, తానొక గాయకుడినని, గాయపడ్డ ప్రజల పాటలను రాయడం, పాడటం తన వృత్తి అని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యను చదివిన తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవని అందులో పేర్కొన్నారు గద్దర్.

కళాకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న గద్దర్

కళాకారుడిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న గద్దర్

కళాకారునిగా తనను నియమించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో ఆయన విజ్ఞప్తి చేశారు . సాంస్కృతిక సారథి నియామక కమిటీ సభ్యుడు శివ కుమార్‌ను కలిసి ప్రముఖ గాయకుడు గద్దర్ దరఖాస్తును అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్న గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు.. ఇప్పుడు ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

 తన ఉద్యోగ దరఖాస్తుపై స్పందించిన గద్దర్

తన ఉద్యోగ దరఖాస్తుపై స్పందించిన గద్దర్

ఇక తన ఉద్యోగ దరఖాస్తుపై స్పందించిన గద్దర్.. ఉద్యోగానికి అప్లికేషన్​ పెట్టుకున్నది నిజమే కళాకారుడిగా టెంపరరీ ఉద్యోగం అడిగానని తెలిపారు. దాదాపు 5 వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నేనొక్కడిని. దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. నా వృత్తి పాడటమే. నాకు పాడటం వచ్చు. నేను బతకాలి కదా.. అందుకే దరఖాస్తు పెట్టుకున్నట్టు గద్దర్ పేర్కొన్నారు.

తెలంగాణా సర్కార్ పథకాల స్కిట్లు తానూ ప్రదర్శిస్తానంటున్న గద్దర్

తెలంగాణా సర్కార్ పథకాల స్కిట్లు తానూ ప్రదర్శిస్తానంటున్న గద్దర్

ఇక అంతే కాకుండా తాను లీడర్ షిప్ ఏమీ అడగలేదని, ఉద్యోగం మాత్రమే అడిగాను అని చెప్పారు గద్దర్. కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు తిరుగుతానని పేర్కొన్న గద్దర్ మిగతా కళాకారులు లాగా తాను కూడా అన్ని స్కిట్లు చేస్తానని పేర్కొన్నారు. డబుల్​ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమికి సంబంధించిన స్కిట్లు తాను కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ నుండి ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పిన గద్దర్ ఇప్పుడు, తెలంగాణ ప్రభుత్వంలో కొలువు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

గద్దర్ ప్రభుత్వ పథకాల భజన చెయ్యగలడా ?

గద్దర్ ప్రభుత్వ పథకాల భజన చెయ్యగలడా ?

73 ఏళ్ల లేటు వయసులో ఉద్యోగం చేయాలన్న గద్దర్ కోరిక తీరుతుందా? అసలు ధిక్కార స్వరం వినిపించి ప్రజలను చైతన్యం చేసిన ఆయన కలం , గళం ప్రభుత్వ పథకాల భజన చెయ్యగలవా ? తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పెట్టుకున్న అప్లికేషన్ కు ప్రభుత్వం స్పందిస్తుందా ? అసలు ఇప్పుడు గద్దర్ ఎందుకు ఇలా చేశారు అనేవి తెలియాలంటే వేచి చూడాలి.

English summary
Telangana Public War Ship, people singer Gaddar, 73, has now applied for a job. The shocking thing is that Gaddar's application to Telangana samskruthika saradhi to get a job is a matter of serious debate in the state of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X