• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఒలంపియన్ గగన్ కలలపై నీళ్ళు .. హైదరాబాద్ వరదల్లో మునిగిన షూటింగ్ అకాడమీ రైఫిల్స్,పిస్టల్స్

|

ఒలంపియన్ గగన్ కలలపై నీళ్ళు చల్లాయి హైదరాబాద్ ను ముంచేసిన భారీ వర్షాలు . ఊహించని విధంగా కురిసిన వర్షానికి హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా తయారైంది . లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ కు సంబంధించి గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో 8 ఫీట్ల మేర నీరు చేరటంతో ఆయన ఆవేదన వర్ణనాతీతంగా మారింది . ఇటీవల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన షూటింగ్ సామాగ్రి నీట మునగటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గగన్ నారంగ్ .

ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదే

పేద క్రీడాకారులకు ఉచిత షూటింగ్ శిక్షణ కోసం అకాడెమీ పెట్టిన గగన్

పేద క్రీడాకారులకు ఉచిత షూటింగ్ శిక్షణ కోసం అకాడెమీ పెట్టిన గగన్

పేద క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఒలంపియన్ గగన్ నారంగ్ కొనుగోలు చేసిన షూటింగ్ సామాగ్రి పూర్తిగా నీట మునగటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు గగన్ నారంగ్ . 80 రైఫిల్స్ మరియు పిస్టల్స్‌తో సహా 1.3 కోట్ల రూపాయల విలువైన పరికరాలను హైదరాబాద్ వరదలో మునిగిపోయాయని పేర్కొన్నారు. తిరుమల్ గిరి లో గం ఫర్ గ్లోరీ అకాడమీలో వర్షాల కారణంగా వరదనీరు చేరింది. ఈ అకాడమీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయంలో నారంగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు.

 భారీ వర్షాలకు మునిగిపోయిన అకాడెమీ .. మునిగిన రైఫిల్స్ , పిస్టల్స్

భారీ వర్షాలకు మునిగిపోయిన అకాడెమీ .. మునిగిన రైఫిల్స్ , పిస్టల్స్

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటంతో అకాడెమీలోకి నీరు చేరుతుందన్న స్థానికుల సమాచారంతో తాను అకాడమీకి వెళ్ళానని, అయితే తను అక్కడికి చేరే సమయానికి నీటి మట్టం దాదాపు 8 ఫీట్ల మేర చేరిందని , నీటి మోటార్లను ఉపయోగించి నీటిని తోడి సామాగ్రిని బయటకు తీశామని నారంగ్ చెప్పారు . ఇది చాలా హృదయ విదారక బాధగా ఆయన పేర్కొన్నారు . 80 రైఫిళ్లు, పిస్టల్స్‌తో పాటు 20 పాత రైఫిళ్లు, నాలుగు ఎలక్ట్రానిక్, 10 మాన్యువల్ టార్గెట్‌లు దెబ్బతిన్నాయని నారంగ్ తెలిపారు.

 గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ద్వారా వర్ధమాన షూటర్లకు తర్ఫీదునిస్తున్న గగన్

గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ ద్వారా వర్ధమాన షూటర్లకు తర్ఫీదునిస్తున్న గగన్

గత సంవత్సరం, జిఎన్‌ఎస్‌పిఎఫ్‌కు జాతీయ క్రీడా పురస్కారాలలో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ లభించింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడేళ్ల తర్వాత, గగన్ నారంగ్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (జిఎన్‌ఎస్‌పిఎఫ్) ప్రారంభించారు . 2015 లో అకాడమీని ప్రారంభించాడు. ప్రపంచ నంబర్ వన్ ఎలవెనిల్ వలరివన్, 2019 జూనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత ధనుష్ శ్రీకాంత్ వంటి షూటర్లు నారంగ్ అకాడమీలో శిక్షణ పొందుతారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అకాడమీని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నారంగ్ తెలిపారు. అయితే, తాజా పరిస్థితితో అది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

పాడైపోయిన రూ1.3 కోట్ల విలువైన జర్మనీ నుండి తెప్పించిన షూటింగ్ సామాగ్రి

పాడైపోయిన రూ1.3 కోట్ల విలువైన జర్మనీ నుండి తెప్పించిన షూటింగ్ సామాగ్రి

కొత్త రైఫిల్స్ మరియు పిస్టల్స్ వాల్తేర్ మరియు పార్దిని బ్రాండ్లకు చెందినవని అవి తన సొంత డబ్బుతో గచిబౌలి క్యాంపస్ కోసం కొనుగోలు చేయబడ్డాయని చెప్పారు .లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత, ఈ షూటింగ్ పరికరాలను జర్మనీ నుండి తెప్పించి దిగుమతి చేసుకున్నామని చెప్పారు . 1.3 కోట్ల రూపాయల విలువైన పరికరాలు పాడైపోయాయని వాపోయాడు. వర్ధమాన షూటర్లను తీర్చిదిద్దే ఆలోచనతో గగన్ కలలు భారీ వరదల కారణంగా కల్లోలంగా మారాయి. ఇలాంటి విపత్తును ఊహించని కారణంగా ఇన్సూరెన్స్ చేయించలేదని గగన్ లబోదిబోమంటున్నారు.

  Hyderabad Floods Remembering 1908 Musi Floods That Changed Face of Hyderabad || Oneindai Telugu

  English summary
  London Olympics bronze medalist Gagan Narang claimed equipment worth Rs 1.3 crore, including 80 rifles and pistols, at his Gun for Glory academy ‘has been adversely affected’ in the Hyderabad deluge. Narang said 80 rifles and pistols, 20 old rifles, four electronic and 10 manual targets suffered damage.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X