హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక గ‌జ్వేల్ పెద్ద‌న్న ప్ర‌తాప‌న్న‌..! పూర్తి బాద్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్న కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్టులు జ‌రిగిపోతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ విజ‌యం సాధించ‌డం, ఇక ఇప్ప‌ట్లో టీఆర్ఎస్ పార్టీతో వైరుద్యం పెట్టుకుని ఏమీ సాధించ‌లేమ‌ని భావిస్తున్న నేత‌లు రాజీ ప‌డిపోతున్నారు. అభివ్రుద్దిలో భాగ‌స్వామ్యం అవ్వ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేక‌పోవ‌డంతో అదికార గులాబీ పార్టీతో చేతులు క‌లిపేందుకు సై అంటున్నారు ఇత‌ర పార్టీ నేత‌లు. ఇదే కోవ‌లో న‌డుస్తున్నారు గ‌జ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్ర‌తాప్ రెడ్డి. అదికార గులాబీ పార్టీతో అలుపెర‌గ‌ని పోరాటం చేయ‌డ‌మే కాకుండా స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైన పోటీకి సై అన్నారు ప్ర‌తాప్ రెడ్డి. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ అనూహ్య విజ‌యం సాధించ‌డంతో క‌నువిప్పు క‌లిగిన నేత‌లు ఆ పార్టీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని మ‌లుపులు..! టీఆర్ఎస్ లోకి పెద్ద‌యెత్తున వ‌ల‌స‌లు..!!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని మ‌లుపులు..! టీఆర్ఎస్ లోకి పెద్ద‌యెత్తున వ‌ల‌స‌లు..!!

తెలంగాణ రాజకీయాలు మరోసారి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి సరికొత్త వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత అంటే గురువారం రాష్ట్రంలో రెండో శాసన సభ కొలువుదీరింది. నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది సభ్యులుండగా, గురువారం 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్..! జాతీయ పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న కేసీఆర్..!!

బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్..! జాతీయ పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న కేసీఆర్..!!

ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. టీపీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ తరఫున ముందస్తు ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయన శుక్రవారం సాయంత్రం బేగంపేటలోని ప్రగతి భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకున్నారు. గ‌తంలో ఎన్నోసార్లు గులాబీ పార్టీ నుంచి త‌న‌కు ఆహ్వానం అందినా పార్టీలో చేర‌లేక పోయానని వంటేరే చెప్పుకొచ్చారు.

కేసీఆర్ కు వ్య‌తిరేకంగా అటుపెర‌గ‌ని పోరాటం..! అక‌స్మాత్తుగా రాజీకొచ్చిన వంటేరు..!

కేసీఆర్ కు వ్య‌తిరేకంగా అటుపెర‌గ‌ని పోరాటం..! అక‌స్మాత్తుగా రాజీకొచ్చిన వంటేరు..!

ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల్లో కేసీఆర్‌పై గెలిచేందుకు సర్వశక్తులు వడ్డారు. గత ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో పాటు, స్థానిక నేత కావడంతో కేసీఆర్‌కు గట్టి పోటీ తప్పదని అంతా అనుకున్నారు. దీనికితోడు, కొన్ని హైడ్రామాల మధ్య జరిగిన ఆ ఎన్నికలో ఒంటేరు 50 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

గ‌జ్వేల్ బాద్య‌త‌లు వంటేరుకే..! ప‌రిశీలిస్తున్న గులాబీ బాస్..!!

గ‌జ్వేల్ బాద్య‌త‌లు వంటేరుకే..! ప‌రిశీలిస్తున్న గులాబీ బాస్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇందుకు గానూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తనను గెలిపించిన గజ్వేల్ ప్రజలకు అన్యాయం చేసినట్లవుతుందని, అందుకే ముఖ్య నేతలతో వంటేరుతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, గజ్వేల్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ అభివ్రుద్ది బాద్య‌త‌ల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌తాప్ రెడ్డికి అప్ప‌గించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Gajwel congress party leader Pratap Reddy joined in TRS Party. He fight against the Chief Minister KCR in the long back and recent pre elections. and he defeated. In the pre elections, the TRS party won and the leaders from various parties are willing to join in the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X